హెచ్ పీసీఎల్ లో 200 ఇంజినీర్ పోస్టులు

హెచ్ పీసీఎల్ లో 200 ఇంజినీర్ పోస్టులు

హిందుస్థాన్ పెట్రోలియం కా ర్పొరేషన్ లి మిటెడ్ (హెచ్ పీసీఎల్ ) ఇంజినీర్ల రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలి; ఖాళీలు: 200(విభాగాలు: మెకాని కల్ ఇంజినీర్ –120, సివిల్ ఇంజినీర్ –30, ఎలక్ట్రికల్ ఇంజినీర్ –25, ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజినీర్ –25); అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో నాలుగేళ్ల ఫుల్ టైం రెగ్యు లర్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

వయసు 25 ఏళ్లకు మించకూడదు; సెలెక్షన్ ప్రాసెస్ : కంప్యూ టర్ బేస్డ్​ టెస్ట్​, గ్రూప్ టాస్క్​, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వీటిలో కంప్యూటర్ బేస్డ్​ టెస్ట్​కు 85 శాతం , గ్రూప్ టాస్క్​కు 5 శాతం, ఇంటర్వ్యూకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది. ; శాలరీ: రూ. 50 వేల నుంచి రూ.1.60 లక్షలు; దరఖాస్తులు: ఆన్ లైన్ లో..; అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం: 3 మార్చి 2021; చివరి తేది: 15 ఏప్రిల్ 2021; వెబ్ సైట్ : www.hindustanpetroleum.com