కామేపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని పండితాపురం గ్రామానికి చెందిన 200 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీకి ఆదివారం రాజీనామా చేశాయి. ఇందులో వార్డు మెంబర్లు తొండల ముత్తయ్య, మొగిలి విజయ, పీఎసీఎస్ డైరెక్టర్ మేకపోతుల మహేశ్‌గౌడ్, బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు బానోతు నరసింహ నాయక్, గ్రామ పెద్దలు, యువకులు ఉన్నారు. తామంతా డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాటలో నడుస్తామని స్పష్టం చేశారు.
ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ ఒంటెత్తు పోకడలతో విసిగిపోయి రాజీనామాలు చేశామన్నారు. డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ మండలంలో పలు గ్రామాల్లో ఇంకా కొన్ని వందల కుటుంబాలు రాజీనామా చేయబోతున్నాయని ప్రకటించారు. అందరూ పొంగులేటి బాటలో నడుస్తారన్నారు. ఎల్ హెచ్ పీఎస్ మండల అధ్యక్షుడు భూక్య నాగేంద్రబాబు, వార్డ్ మెంబర్ బానోతు లక్ష్మ నాయక్, మాజీ ఉప సర్పంచ్ ధారావత్ లాలు, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు మేకల మల్లికార్జునరావు, రాయల నాగశంకర్, బండి ఎల్లయ్య, మంజుల చిరంజీవి, గుగులోత్ సక్కుబాయి, చంద్రు తురక బిక్షం పాల్గొన్నారు.