ఎల్లారెడ్డిపేట, వెలుగు : ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన సుమారు 200 మంది రైతులు శనివారం కాంగ్రెస్‌లో చేరారు. వీరికి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పనులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. నియోజకవర్గంలో అవినీతిపరులైన బీఆర్ఎస్ లీడర్లను వదిలిపెట్టేది లేదన్నారు.
బండలింగంపల్లి గ్రామస్తులు తనకు అత్యధికంగా ఓట్లు వేశారని, వారికి ధన్యవాదాలు తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లీడర్లు జంగ అంజిరెడ్డి, సద్ది లక్ష్మారెడ్డి, దొమ్మాటి నర్సయ్య,రమేశ్, శ్రీకాంత్ రెడ్డి, బాలచందర్, ఎల్లా గౌడ్, దేవయ్య ,ఇమామ్, హైమద్ ,రాజిరెడ్డి,నవీన్ మార్పు రాజు,ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.