మెగా జాబ్ మేళాతో 200 మందికి ఉద్యోగాలు 

హాలియా, వెలుగు: ఏకే ఫౌండేషన్ కట్టెబోయిన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా శుక్రవారం హాలియా పట్టణంలోని ఆకాంక్ష హై స్కూల్ నిర్వహించిన మెగా జాబ్ మేళాలో సు మారు 200 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ను ఎంఈఓ బాలు నాయక్  అభినందించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ బాబు రావు నాయక్, ఆకాంక్ష హై స్కూల్ డైరెక్టర్ శ్రీను, ప్రిన్సిపాల్ మోదాల రవికుమార్ పాల్గొన్నారు.