
మైచాంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లా బాపట్లలో తీరాన్ని తాకింది. జాతీయ ర్యాంకింగ్ టిటి టోర్నమెంట్ సోమవారం ముగిసిన తర్వాత 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడలో భారీ వర్షం కురిసింది. తూర్పు తీరంలో విధ్వంసం కారణంగా విజయవాడలో 200 మంది టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు చిక్కుకుపోయారు.
అండర్ -11 నుండి అండర్ -19 మధ్య వయస్సు గల దాదాపు 200 మంది క్రీడాకారులు వారి కుటుంబ సభ్యులతో పాటు చిక్కుకుపోయారని టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టిటిఎఫ్‌ఐ) అధికారి మంగళవారం పిటిఐకి తెలిపారు. ఇక్కడ సోమవారం నేషనల్ ర్యాంకింగ్ టిటి టోర్నమెంట్ ముగిసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, హర్యానాలో జరిగే తదుపరి పోటీలకు ఆటగాళ్లు హర్యానాలోని పంచకుల చేరుకోవాల్సి ఉంది. తుఫాన్ కారణంగా చేరుకోగలమా అని ఆటగాళ్లు కంగారు పడుతున్నారు.
మిచౌంగ్ తుఫాన్(Cyclone Michaung) ధాటికి తమిళనాడు రాజధాని చెన్నై నగరం అల్లకల్లోలంగా మారిన సంగతి తెలిసిందే. ఇక్కడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కాగా.. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయం నీటమునగాయి. దీంతో పలు విమనాలు రద్దు కాగా, మరొకొన్నింటిని దారి మళ్లించారు.
Andhra Pradesh: 200 Table Tennis Players Stranded In Vijayawada Due To #CycloneMichaunghttps://t.co/RmEXKeei58
— Free Press Journal (@fpjindia) December 5, 2023