ముత్తారం, వెలుగు : తనకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మంథని ఇన్చార్జి చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. మండలంలోని మచ్చుపెట చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన చెందిన సుమారు 200 మంది మహిళలు సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీలోచేరారు.
వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ మంథనిలో పార్టీ జెండా ఎగరాలంటే తనకుకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి క్రాంతి కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు కుమార్, కర్రె శ్రీవాణి, నాయకులు తదితరులు ఉన్నారు.