
కడెం/నస్పూర్, వెలుగు: కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2007-–08లో పదో తరగతి చదివిన నాటి విద్యార్థులు మళ్లీ ఒకచోటికి చేరారు. మండలంలోని కొండుకూర్లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. నాడు విద్య నేర్పిన గురువులను ఆహ్వానించి సన్మానించారు.
శ్రీరాంపూర్ కాలనీలోని సాందిపనీ హైస్కూల్లో 2004–05లో టెన్త్ చదువుకున్న విద్యార్థులు ఆదివారం మంచిర్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో కలుసుకున్నారు. చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకుంటూ అనందంగా గాడిపారు. నాటి టీచర్లను సన్మానించారు.