ఆర్టీసీ కండక్టర్ల ఖాతాల్లో బాండ్ల డబ్బులు జమ

  • మొత్తం రూ.85 కోట్లు కండక్టర్ల ఖాతాలోకి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఆర్టీసీ కండక్టర్లకు 2013 పే రివిజన్ కు సంబంధించిన బాండ్ల డబ్బులు నేరుగా వారి ఖాతాలో జమ అయ్యాయి. మొత్తంగా రూ.85 కోట్లను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 వేల మంది కండక్టర్ల సాలరీ అకౌంట్లలో గురువారం జమ చేశారు.

ఈ ఫిబ్రవరిలో రూ.80 కోట్లు డ్రైవర్ల ఖాతాలో జమ కాగా, ఇప్పుడు కండక్టర్ల ఖాతాలో జమ అయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి రాగానే  సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ల ఖాతాలోకి బాండ్ల నిధులు జమ చేయడంపై ఆర్టీసీ ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.