'గౌతమ్ గంభీర్..' ఈ మాజీ ఓపెనర్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముక్కు సూటితో మాట్లాడటం తన నైజం. ఈ తరహా ప్రవర్తనతోనే అతను అనేక వివాదాలను కొని తెచ్చుకుంటుటారు. అలా అని ఆటపరంగా అతన్ని తీసిపారేయలేం. దేశానికి వరల్డ్ కప్‌లు సాధించి పెట్టిన ఘనత ధోనీదే అయినా.. ఆ విజయాల వెనుకున్న కీలక ఆటగాడు మాత్రం గంభీరే.
2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్.. ఈ రెండు టోర్నీల్లోనూ గంభీర్ టాప్ స్కోరర్. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో 97 పరుగులు చేసిన గంభీర్.. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే, 2014 సీజన్‌లో జరిగిన ఓ సంఘటన తనను ఎప్పుడూ బాధిస్తూ ఉంటుందని, ఎవరికీ తలొగ్గని నేను ఆ ఒక్క ఇన్సిడెంట్‌తో ఇప్పటికీ సిగ్గుపడుతున్నానని తాజాగా చెప్పుకొచ్చారు.
ఐపీఎల్ 2014 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించిన గంభీర్.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యారు. దీంతో తర్వాతి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగేందుకు ధైర్యం సరిపోక మనీష్ పాండేను ఓపెనర్‌గా పంపించానని గుర్తు చేసుకున్నారు. అయితే ఆ మ్యాచ్‌లో మనీష్ డకౌట్ అవ్వగా.. ఫస్ట్ డౌన్‌లో వెళ్లిన తాను కూడా ఒక్క పరుగుకే వెనుదిరిగానని తెలిపారు. ఆ క్షణం తాను చాలా పశ్చాతాపానికి గురయ్యానని, సిగ్గుతో తల దించుకున్నానని వెల్లడించారు..
దుబాయ్ వేదికగా జరిగిన 2014 014 సీజన్‌లో గౌతమ్ గంభీర్ సారథ్యంలోని కేకేఆర్ విజేతగా నిలిచింది.
Kolkata Knight Riders became the 2nd team to win 2 IPL titles on this day in 2014, the vintage Knight Riders Era under the inspirational leader Gautam Gambhir with Uthappa winning Orange Cap & Narine taking 21 wickets.
— Johns. (@CricCrazyJohns) June 1, 2023
KKR lost 5 games out of the first 7 then made a remarkable… pic.twitter.com/kFL6Oyp81D
గంభీర్ క్రికెట్ కెరీర్:
- టెస్టులు: 58 మ్యాచ్‌లు - 4154 పరుగులు
- వన్డేలు: 147 మ్యాచ్‌లు - 5238 పరుగులు
- ఐపీఎల్: 154 మ్యాచ్‌లు 217 పరుగులు