2014 నుండి ఇప్పటివరకూ.. మోదీ అందుకున్న అంతర్జాతీయ అవార్డుల లిస్ట్

2014 నుండి ఇప్పటివరకూ.. మోదీ అందుకున్న అంతర్జాతీయ అవార్డుల లిస్ట్

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు రష్యాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో మోదీ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడమే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌‌తో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ దేశ ప్రభుత్వం.. భారత ప్రధానిని ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం "ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూ ది అపోస్టల్‌" సత్కరించింది. దాంతో, మోదీ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు వచ్చి చేరింది. 

తొలిసారి 2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ ఇప్పటివరకూ 78 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. వీటిలో ఒక్కోసారి మూడు నాలుగు దేశాలను చుట్టివచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికాలో 8 సార్లు పర్యటించారు. ఇక ఫ్రాన్స్, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లను ఏడుసార్లు చుట్టి రాగా.. జర్మనీ, రష్యాలో ఆరుసార్లు పర్యటించారు.  ఇటువంటి విదేశీ పర్యటనల్లో మోదీ ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆ అవార్డులు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

మోదీకి లభించిన అంతర్జాతీయ అవార్డుల లిస్ట్ 

  • జూలై 13, 2023: గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ (ఫ్రాన్స్)
  • జూన్ 2023: ఆర్డర్ ఆఫ్ నైలు (ఈజిప్టు)
  • మే 2023: గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు (పపువా న్యూ గినియా)
  • మే 2023: కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ (ఫిజీ)
  • 2023: ఎబకల్ (Ebakl) అవార్డు (రిపబ్లిక్ ఆఫ్ పలావ్) 
  • డిసెంబర్‌ 2021: ఆర్డర్ ఆఫ్ డ్రక్ గ్యాల్పో (భూటాన్)
  • డిసెంబర్ 2020: లెజియన్ ఆఫ్ మెరిట్, యునైటెడ్ స్టేట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అవార్డు (యుఎస్)
  • 2019: కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్‌ (బహ్రెయిన్)
  • 2019: ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్ (మాల్దీవులు)
  • 2019: ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డు (రష్యా)
  •  2019: ఆర్డర్ ఆఫ్ జాయెద్ అవార్డు (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)
  • 2018: గ్రాండ్ కాలర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు (పాలస్తీనా)
  • జూన్ 2016: స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్‌ (ఆఫ్ఘనిస్తాన్)
  • 2016: కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్ (సౌదీ అరేబియా)

ఇతర అవార్డులు:

భారత ప్రధానికి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక సంస్థలు అనేక అవార్డులను ప్రదానం చేశాయి. వాటి జాబితా కూడా చూద్దాం.. 

  • 2021: గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ లీడర్‌షిప్ అవార్డు (కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేట్స్ CERA)
  • 2019: గ్లోబల్ గోల్‌కీపర్ అవార్డు (బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్)
  • 2019: ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు
  • యునైటెడ్ నేషన్స్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు
  • 2018: సియోల్ శాంతి బహుమతి