ఒక్కోసారి కొన్ని చిత్రాల రిజల్ట్ అంచనాలని మించి ఉంటుంది. ఈ క్రమంలో ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే 2019లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన బద్లా చిత్రం కూడా ఈ కోవకే చెందుతుందని చెప్పవచ్చు.
కాగా బద్లా చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుజయ్ ఘోష్ మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ తాప్సి పన్ను మరియు బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించారు.
అయితే ఈ చిత్రాన్ని ఎటువంటి అంచనాలు లేకుండా రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ ఆకట్టుకునే కథాంశం, మేకింగ్, థ్రిల్లర్ సన్నివేశాలు, నటీనటుల యాక్టింగ్, సాంకేతిక నిపుణుల పనితీరు వంటివాటి కారణంగా బద్లా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతోపాటు , కమర్షియల్ గా కూడా సక్సస్ అయ్యింది.
ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రూ.140 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసింది. దీంతోపాటు పలు రికార్డులు, అవార్డులు కూడా అందుకుంది. దీన్నిబట్టి కంటెంట్ ఉన్న చిత్రాలకి సినిమా క్యాస్ట్ & క్రూ అలాగే బడ్జెట్ తో పనిలేదని బదలా బద్లా చిత్రం నిరూపించిందని చెప్పవచ్చు.
ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య నటి తాప్సి తెలుగు చిత్రాల్లో నటించడానికి మొగ్గు చూపడం లేదు. ఈ క్రమంలో పూర్తిగా బాలీవుడ్ కే పరిమితం అయింది. ఇందులో భాగంగా ఎక్కువగా యాక్షన్ మరియు లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తోంది.