సంక్రాంతి సినిమాలు : 2019 పోటీ 2025లో రిపీట్.. ఈసారి హిట్ కొట్టేదెవరో..?

సంక్రాంతి సినిమాలు : 2019 పోటీ 2025లో రిపీట్..  ఈసారి హిట్ కొట్టేదెవరో..?

సంక్రాంతి వస్తుందంటే చాలు టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమల్లో సినిమాల జాతర మొదలవుతుంది. దీంతో కోళ్ల పందేలు, బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి, పిండి వంటలు అంటూ ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది. అయితే ఈసారి బాక్సాఫిస్ వద్ద టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ తదితరులు పోటీ పడుతున్నారు. 

ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ మొదటగా జనవరి 10న రిలీజ్ కానుంది. దీంతో ఇప్పటికే ఏపీలో ఈ సినిమాకి టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించారు. పొలిటికల్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా మొదటిరోజే రూ.300 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా స్టార్ హీరోయిన్స్ కియారా అద్వానీ, అంజలి నటిస్తుండగా ఎస్జే సూర్య, సునీల్, శ్రీకాంత్, బ్రహ్మనందం, 

ఇక బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా కూడా జనవరి 12న థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే డాకు మహారాజ్ నుంచి వసిఘ్హిన టీజర్, ట్రైలర్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి. దీంతో బాలయ్య ఫ్యాన్స్ కి కూడా ఫుల్ ప్యాక్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. 

ALSO READ | HAINDAVA Glimpse: ఇంట్రెస్టింగ్ గా బెల్లంకొండ బాబు హైందవ గ్లింప్స్.. హిట్ కొడతాడా..?

సంక్రాంతి బరిలో దిగేందుకు మరోవైపు వెంకీమామ కూడా సిద్దమవుతున్నాడు. అనిల్ రావిపూడి వెంకటేష్ కి మంచి లక్కీ డైరెక్టర్ అని చెప్పవచ్చు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి ఎఫ్ 2 సినిమా మంచి హిట్ అయ్యింది. దీంతో ఈసారి ఈ ఇద్దరూ "సంక్రాంతికి వస్తుంన్నాం" సినిమాతో అలరించేందుకు జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 

అయితే 2019లో రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ తదితరులు సంక్రాంతి వారిలో పోటీ పడ్డారు. ఇందులో రామ్ చరణ్, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు కూడా ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయింది. కానీ విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలసి నటించిన మల్టీస్టారర్ ఎఫ్ 2 మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాదాపుగా 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండడంతో ఆసక్తి నెలకొంది.