ఎన్నికలు: ఏపీలో ఈరోజు నామినేషన్ వేసింది వీరే

ఎన్నికలు: ఏపీలో ఈరోజు నామినేషన్ వేసింది వీరే

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి పెరిగింది. ఈ రోజు ప్రముఖుల ప్రచారాలతో పాటు.. ఆయా పార్టీల అధ్యక్షులు నామినేషన్ వేశారు. వీరితో పాటు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కూడా నామినేషన్ లో భాగమయ్యారు.

చిత్తూరు జిల్లా కుప్పం నుంచి  టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు.. ఆయన తరపున  ఆ పార్టీ నేతలు నామినేషన్ వేశారు.  ఇందుకు..  టీడీపీ నేతలతో పాటు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.

పులివెందుల బహిరంగ సభలో పాల్గొన్న జగన్… ఆ తరువాత నామినేషన్ వేశారు. జగన్ నామినేషన్ కు కార్యకర్తలు , అభిమానులు భారీగా తరలివచ్చారు.

భీమవరం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు తహశీల్దార్ ఆఫీస్ లో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాలన్నారు. కాబోయే భీమవరం ఎమ్మెల్యేను తానేనని ధీమా వ్యక్తం చేశారు. మహిళలకు టీడీపీ పాలనలో రక్షణ లేదన్నారు పవన్.

నామినేషన్ గడువు ఈ నెల 25న ముగియనుండటంతో.. అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్, నగరి నియోజకవర్గంలో రోజా.. హిందూపురంలో బాలకృష్ణ, విజయవాడలో పీవీపీ, కేశినేని నాని, విశాఖ పట్నంలో ఎంపీ స్తానానికి జేడీ లక్ష్మీనారాయణ, కర్నూల్ ఎంపీ స్థానానికి టీజీ భరత్, గుంటూరులో గల్లా జయదేవ్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు ఇతర నేతలు నామినేషన్లు వేశారు.