పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత ఎక్కువ లోక్ సభ సీట్లు (42) ఉన్న రాష్ట్రం వెస్ట్ బెంగాలే. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు (డార్జిలింగ్, అసన్ సోల్)సీట్లతోనే సరిపెట్టుకుంది. ఈ సంఖ్యను పదింతలు పెంచుకుని కనీసం 20 సీట్లు గెలు చుకోవాలన్నది బీజేపీ ప్లా న్. దీని కోసం పార్టీ ప్రెసిడెంట్ అమిత్ షా డైరెక్షన్ లో ‘మిషన్–20’ని రూపొందించింది.
లుక్ ఈస్ట్’ ప్లాన్ కింద బీజేపీ ఇప్పటికే మిజోరాం, సిక్కింలో మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ బలంగా కాలు మోపింది. ఇదే ఇన్‌స్పిరేషన్ పశ్చిమ బెంగాల్ లో ‘మిషన్–20’ ప్లా న్‌ని సక్సెస్ చేయడానికి బీజేపీ లీడర్లు పట్టుదలతో పనిచేస్తున్నారు. దీనికోసం అనుసరించాల్సిన వ్యూహాలపై లోకల్ లీడర్లకు కూడా పార్టీ హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో ఈ 20 నియోజకవర్గాల్లో గెలుపుకోసం స్థానిక నేతలు సర్వశక్తులు మోహరిస్తున్నారు . బీజేపీ టార్గెట్ గా పెట్టుకున్న 20 నియోజకవర్గాల్లో ఆరు సెగ్మెంట్లు ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వు చేసినవి ఉన్నాయి. ఇందులో కూచ్ బెహార్ ( ఎస్సీ), జల్ పాయ్ గురి (ఎస్సీ), అలీపుర్ దౌర్ (ఎస్టీ)తో పాటు మరో మూడు సీట్లు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అయిన నియోజకవర్గాలను గెలుచుకోవడానికి పార్టీ సీనియర్ నేత ముకుల్ రాయ్ నాయకత్వంలో పక్కా ప్లాన్ రెడీ చేసింది.
ఆరు సెగ్మెంట్లలో మతువాలు కీలకం పశ్చిమ బెంగాల్ లోని షెడ్యూల్డ్ కులాల్లో మతువా కమ్యూనిటీ కీలకమైనది. రాష్ట్రం లోని ఆరు లోక్‌సభ సెగ్మెంట్లలో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఈ కమ్యూనిటీ ఉంది. మతువా కమ్యూనిటీ చాలాకాలం వరకు తృణమూల్ కాంగ్రెస్ కి అండగా నిలబడింది. తాజాగా ఒక వర్గం బీజేపీ వైపు వెళ్లిపోయింది. దీంతో మమతా బెనర్జీ ఓటు బ్యాంక్‌కి చెక్ పడ్డట్లయింది. దీంతోపాటు టీ ఎస్టేట్లలో పనిచేసే కార్మికులపై కూడా కాషాయ పార్టీ దృష్టి పెట్టింది. జల్ పాయ్ గురి, అలీపుర్ దౌర్, కూచ్ బెహార్ లోక్‌సభ సెగ్మెంట్లలో తేయాకు కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు . టీ ఎస్టేట్లలో పనిచేసేవాళ్లలో మెజారిటీ వర్గం ఆదివాసీలు, దళితులు. కొన్ని దశాబ్దాల పాటు రాష్ట్రా న్ని పాలించిన లెఫ్ట్ ఫ్రంట్ కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కానీ తేయాకు కార్మి కుల సమస్యలను పూర్తిగా తీర్చలేకపోయాయి. ఈ నేపథ్యంలో తాము ఉద్యమాలు చేశామని కాషాయ దండు క్లెయిమ్ చేసుకుంటోంది. టీ ఎస్టేట్ కార్మి కులంతా తమ వైపే ఉంటారని బీజేపీ లీడర్లు లెక్కలు వేసుకున్నారు.
సౌత్ బెంగాల్లో ఆరెస్సెస్ బడులు సౌత్ బెంగాల్లో ఆరెస్సెస్ కి మొదటినుంచి కాస్తంత పట్టుంది. ఇక్కడ ఆరెస్సెస్ ఆధ్వర్యంలో అనేక స్కూల్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు తొలిసారి ఓటుహక్కు పొందిన చాలామంది ఓటర్లు ఆరెస్ సెస్ బడుల్లో చదువుకున్నవారే. ఇలాంటి యంగ్ ఓటర్ల మీద కాషాయ పార్టీ బోలెడు ఆశలు పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నా, అది నామ్ కే వాస్తేనే. రూట్ లెవెల్లో మమత సర్కార్ పై పోరాటం చేస్తోంది బీజేపీనే. బెంగాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా జనాభాలో 70 శాతం ఉన్న హిందువుల ఓట్లే కీలకం. దీంతో వారి ఓట్లను కొల్లగొట్టడానికి పక్కా వ్యూహంతో బీజేపీ ముందుకెళుతోంది. దుర్గా మాత నిమజ్జన కార్యక్రమం గతంలో ఎన్నడూ లేనంతగా ఈ రెండు మూడేళ్లలో రాజకీయ రంగు పులుముకుంది. దుర్గా మాత నిమజ్జన కార్యక్రమంపై మమత సర్కార్ ఆంక్షలు పెట్టడాన్ని రాజకీయంగా ఇప్పటికే చర్చకు తీసుకువచ్చింది. మొహర్రం ఊరేగింపుతో క్లా ష్ కాకుండా మమత దుర్గా దేవి విగ్రహ నిమజ్జనం డేట్లను సర్దుబాటు చేయబోయింది. అయితే, కోర్టుద్వారా నిమజ్జనానికి అనుకూలంగా ఆర్డర్స్ పొందగలిగారు. ఇటువంటి చర్యలతో ఇప్పటికే బీజేపీ బెంగాల్ లో సామాజికంగా పలుకుబడి సాధించగలిగింది.