దేశీయ మార్కెట్లో అతిపెద్ద బైక్ తయారీసంస్థ హీరో.. ఎప్పటినుంచోఎదురుచూస్తున్న Hero Karizma XMR 210 బైక్ ను భారత్లో లాంచ్ చేసింది. పాత మోడల్ కరిజ్మా బైక్ విడుదలైన సుమారు 20 సంవత్సరాల తర్వాత కరిజ్మా XMR విడుదల అయింది. అయితే కొత్త బైక్ డిజైన్ సహా ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.
Hero MotoCorp ఇప్పుడు ఇండియా మార్కెట్లోకి కొత్త మోడల్ బైక్ కరిజ్మా XMRని విడుదల చేసింది. దీని ధర రూ.1.73 లక్షలు నుంచి ప్రారంభం అవుతుంది. ఈ రోజు నుంచే (ఆగస్టు 31) బుకింగ్ చేసుకోవచ్చు.
2023 హీరో కరిజ్మా XMR 210 డిజైన్ & ఫీచర్స్
ఈ బైక్ మోడల్ ఆకర్షణీయమైన స్పోర్టీ లుక్ డిజైన్తో అందుబాటులోకి వస్తోంది. ఇది ఒరిజినల్ కరిజ్మా బైక్ ఫీచర్లతో కొన్ని విలక్షణమైన, స్టైలీష్ ఫీచర్లను కలిగి ఉంటుంది. LED డేటైమ్ రన్నింగ్ లైట్‌లతో LED హెడ్‌ల్యాంప్‌లు, అలాగే LED టర్న్ ఇండికేటర్‌లు, టెయిల్‌ల్యాంప్ వంటి హైలైట్ ఫీచర్లతో వస్తోంది.
పెట్రోల్ ట్యాంక్ ఆకట్టుకునే క్రీజులు బైక్ ఏరోడైనమిక్ సామర్థ్యానికి దోహదం చేస్తాయి. స్ప్లిట్ సీట్ లేఅవుట్ ఎలివేటెడ్ పిలియన్ సీటు, సన్నని టెయిల్ లు ఇట్టే ఆకట్టుకుంటాయి. కరిజ్మా XMR 210 పూర్తిగా డిజిటల్ కలర్ LCD డిస్‌ప్లేను ప్రదర్శిస్తుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ టెక్నాలజీ. 2023 హీరో కరిజ్మా XMR మూడు డిఫరెంట్ కలర్స్ తో అందుబాటులోకి వస్తుంది. ఐకానిక్ ఎల్లో, మ్యాట్ రెడ్, ఫాంటమ్ బ్లాక్.
హీరో కరిజ్మా XMR 210 బైక్.. లిక్విడ్ కూల్డ్, DOHC 210cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 9,250 rpm వద్ద 25.1bhp శక్తి, 7,250 rpm వద్ద 20.4Nm గరిష్ఠ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. స్లిప్, అసిస్ట్ క్లచ్తో 6 స్పీడ్ గేర్ బాక్స్ కలిగిఉంటుంది.
హీరో కొత్త బైక్ భద్రత, సస్పెన్షన్ పరంగా మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంటుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌తో కూడిన స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ సెటప్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌తో వస్తోంది. భద్రత కోసం డ్యూయల్ ఛానల్ ABSతో ముందు, వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటాయి. ఈ బైక్ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.
హీరో పాత కరిజ్మా బైక్ కంటే కరిజ్మా XMR 210 బైక్ ఎంతో భిన్నంగా ఉంటుంది. పుల్ ఫెయిర్డ్ సెటప్‌తో వస్తుంది. ఈ బైక్ డిజైన్ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటుంది.