జగిత్యాల జిల్లాలో 5070 కేసులు : ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

జగిత్యాల రూరల్, వెలుగు :  పోలీసుల సమష్టి కృషితో జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, పారదర్శకతతో పనిచేయడం వల్ల  పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ ఆఫీస్‌‌‌‌లో 2023 ఏడాదికి సంబంధించి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ 2023లో జిల్లా వ్యాప్తంగా 5070 కేసులు నమోదు అయ్యాయన్నారు. నేర అభియోగాలు ఉన్న వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు.

జిల్లావ్యాప్తంగా మర్డర్ 32, చోరీ 21, ప్రాపర్టీ ఆఫెన్సెస్​306, రేప్ 42, చీటింగ్ 347, క్రిమినల్ బ్రీత్ ఆఫ్ ట్రస్ట్ 19, అటెంప్ట్ మర్డర్లు 66, యాక్సిడెంట్లు 234, ఇతర కేసులు1928 నమోదైనట్లు తెలిపారు. అడిషనల్ ఎస్పీలు భీమ్ రావు, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు వెంకటస్వామి, రవీందర్ రెడ్డి, సురేశ్‌‌‌‌, సీసీఎస్​ఇన్‌‌‌‌స్పెక్టర్​వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ ఇన్‌‌‌‌స్పెక్టర్​ రాజారెడ్డి, సీఐ నటేశ్​పాల్గొన్నారు.