అవాంటెల్ లాభం రూ. 4.46 కోట్లు

అవాంటెల్ లాభం రూ. 4.46 కోట్లు

హైదరాబాద్​, వెలుగు:   అవాంటెల్ లిమిటెడ్ 2024–-25 ఆర్థిక సంవత్సరానికి తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ  పన్ను అనంతర లాభం (నికర లాభం) ఏడాది లెక్కన 8.05శాతం పెరిగి రూ. 4.46 కోట్లకు చేరుకుంది.  కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం కూడా 10.97శాతం వృద్ధితో రూ. 248.48 కోట్లకు చేరుకుంది.  తన రాబోయే కొత్త సౌకర్యాల కోసం   నిధులు సేకరించేందుకు రూ. 81 కోట్ల రైట్స్ ఇష్యూను చేపట్టాలని బోర్డు సిఫార్సు చేసింది.  అంతేగాక ఒక్కో షేరుకు రూ. 0.20 తుది డివిడెండ్ సిఫార్సు చేసింది. అవాంటెల్ ప్రధానంగా రక్షణ,  సమాచార రంగాలకు వైర్‌‌లెస్,  శాటిలైట్ కమ్యూనికేషన్ ఉత్పత్తులు, రాడార్ వ్యవస్థలు,  నెట్‌‌వర్క్ నిర్వహణ సాఫ్ట్‌‌వేర్లను అభివృద్ధి చేస్తుంది.