
హైదరాబాద్, వెలుగు: ఎల్అండ్టీ ఫైనాన్స్ లిమిటెడ్ 2024-–25 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీకి కన్సాలిడేటెడ్ పద్ధతిలో రూ. 2,644 కోట్ల నికర లాభం వచ్చింది. ఇది అంతకు ముందెన్నడూ లేనంత అత్యధిక లాభం కావడం విశేషం. ఈ లాభం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 14శాతం పెరిగింది. 2025 మార్చి 31తో ముగిసిన నాలుగో క్వార్టర్లో ఎల్అండ్టీ ఫైనాన్స్ రూ. 636 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఏడాది లెక్కన ఇది 15శాతం అధికంగా ఉంది. సమర్థవంతమైన నిర్వహణ, బలమైన వ్యాపార వ్యూహాలు, మెరుగైన ఆస్తుల నాణ్యతకు ఫలితాలు నిదర్శనమని కంపెనీ తెలిపింది.