హైదరాబాద్, వెలుగు: అమెజాన్ ఈ నెల 1–8 తేదీల మధ్య సూపర్వాల్యూ డేస్ సేల్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా పండ్లు, కూరగాయలను ఉచితంగా డెలివరీ చేస్తామని హామీ ఇచ్చింది. కస్టమర్లు కిరాణా సామగ్రిపై 45శాతం తగ్గింపును, రూ. 400 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
ప్రైమ్ కస్టమర్లు అదనం రూ. 50 క్యాష్‌బ్యాక్‌ను దక్కించుకోవచ్చు. కొత్త కస్టమర్లు మాంసం, సీఫుడ్, గుడ్లపై 45శాతం తగ్గింపును, రూ. 400ల ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. వింటర్ ప్రొడక్టులపైనా ఆఫర్లు ఉన్నాయి.