- ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ..ఏమేమి కాయొప్పునే..
సిటీలో బతుకమ్మ సంబురాలు బుధవారం ఘనంగా మొదలయ్యాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చిన మహిళలు అంతా ఒక్కచోట చేరి ఆడిపాడారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతి ప్రాంగణంలో వేడుకలు నిర్వహించారు. పీపుల్స్ప్లాజాలోని సరస్ఫెయిర్లో నిర్వహించిన సంబురాల్లో మంత్రి సీతక్క
వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని బతుకమ్మ ఆడారు. కూకట్పల్లి, ఎల్బీనగర్, కొత్తపేట, కృష్ణానగర్, మాన్సూరాబాద్, ఉప్పల్, ఇబ్రహీపట్నంతోపాటు వేర్వేరుచోట్ల బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. – సిటీ నెట్వర్క్, వెలుగు