చెన్నై గ్రాండ్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌.. అర్జున్‌‌‌‌ ఐదో గేమ్‌‌‌‌ డ్రా

చెన్నై గ్రాండ్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌.. అర్జున్‌‌‌‌ ఐదో గేమ్‌‌‌‌ డ్రా

చెన్నై: తెలంగాణ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ ఎరిగైసిఅర్జున్‌‌‌‌  చెన్నై గ్రాండ్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌లో ఐదో రౌండ్‌‌‌‌ గేమ్‌‌‌‌ను డ్రా చేసుకున్నాడు. శనివారం మాస్టర్స్‌‌‌‌ కేటగిరీలో గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ పర్హమ్ మగ్సూద్‌‌‌‌ (ఇరాన్‌‌‌‌)తో జరిగిన ఈ గేమ్‌‌‌‌ను 44 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. దీంతో ఇరువురికి చెరో అర పాయింట్‌‌‌‌ లభించింది. ఈ రౌండ్‌‌‌‌ తర్వాత అర్జున్‌‌‌‌ నాలుగు పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లోనే కొనసాగుతున్నాడు. 

మరో గేమ్‌‌‌‌లో లెవాన్‌‌‌‌ అరోనియన్‌‌‌‌ (అమెరికా) 44 ఎత్తుల వద్ద వాచిర్‌‌‌‌ లాగ్రెవ్‌‌‌‌పై నెగ్గాడు. విదిత్‌‌‌‌ సంతోష్‌‌‌‌– మహ్మద్‌‌‌‌ అమిన్‌‌‌‌, సారానా– అరవింద్‌‌‌‌ మధ్య జరిగిన గేమ్‌‌‌‌లు కూడా డ్రా అయ్యాయి. చాలెంజర్స్‌‌‌‌లో వైశాలితో జరిగిన గేమ్‌‌‌‌ను ద్రోణవల్లి హారిక 44 ఎత్తుల వద్ద డ్రా చేసుకుంది. ప్రాణేశ్‌‌‌‌–మెండోకా.. ప్రణవ్‌‌‌‌–రౌనక్‌‌‌‌ మధ్య జరిగిన గేమ్‌‌‌‌లు డ్రా అయ్యాయి.  చాలెంజర్స్‌‌‌‌లో ప్రణవ్‌‌‌‌ నాలుగున్నర పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో ఉన్నాడు.