డబుల్ కా మీఠా.. 2 లక్షల మంది ఫేవరేట్ ఫుడ్.. స్విగ్గీలో హైదరాబాద్ టాప్

డబుల్ కా మీఠా.. 2 లక్షల మంది ఫేవరేట్ ఫుడ్.. స్విగ్గీలో హైదరాబాద్ టాప్

హైదరాబాద్: 2024 సంవత్సరం ముగియబోతుంది...కొత్త సంవత్సరం 2025 లోకి అడుగుపెట్టబోతున్నాం.. ఇక ఈ ఏడాదిలో ముఖ్యమైన సంఘటనలు ఏంటి..ఎవరు ఏం చేశారో తెలుసుకోవడానికి  ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే   డబుల్ కా మీఠాను  స్విగ్గీలో హైదరాబాద్ వాసులు  అత్యధికంగా  బుక్ చేసుకున్నారని వెల్లడించింది.   స్విగ్గీలో 2 లక్షలకు పైగా  డబుల్ కా మీఠా ఆర్డర్లతో  హైదరాబాద్ రికార్డ్ సృష్టించిందని తెలిపింది. 

2024 లో స్విగ్గీలో హైదరాబాద్ వాసుల నుంచి  రూ. 2.01 లక్షల ఆర్డర్‌లు వచ్చాయంట.  కొత్త పాక వంటకాలు.. చాక్లెట్‌లు పెరిగినప్పటికీ, పండుగ సీజన్‌లో హైదరాబాద్‌లో నెయ్యి మైసూర్ పాక్, డబుల్ కా మీఠా, కాజా, పూర్ణం బూరెలు, చూర్ణం, బూందీ లడూ,  నేరేడు కేక్ వంటి డెజర్ట్‌లతో సాంప్రదాయ రుచులపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలిపింది. 

2024 లో  మదర్స్ డే రోజున హైదరాబాద్ లో  నిమిషానికి సగటున సగటున ఐదు కేక్‌లు 8,050 కేక్‌లను ఆర్డర్ చేశారంట.  అలాగే  దీపావళి వేడుకలకు స్వీట్స్ వినియోగం భారీగా పెరిగిందంట. ఓ కస్టమర్  కాజు కట్లీపై రూ. 35,500 విపరీతంగా ఖర్చు చేశాడని స్విగ్గీ తెలిపింది. మరొక కస్టమర్  స్వచ్ఛమైన నెయ్యి మోతీచూర్ లడ్డూను 40  బాక్స్ లపై రూ. 31,460 ఖర్చు చేశాడని వెల్లడించింది.