- ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా బుధవారం బతుకమ్మ పండుగ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మలు పేర్చి ఆడిపాడుతారు. ఊరూరా, పట్టణాల్లోని వాడవాడలా తంగేడు, గునుగు, బంతి, తామర.. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మకు పూజ చేశారు. సాయంత్రం గ్రామాల్లోని ఆలయాల ఆవరణలో బతుకమ్మలాడి చెరువులు
కుంటల్లో వదిలారు. కరీంనగర్ సిటీలో టవర్ సర్కిల్, కమాన్ ఏరియా, లక్ష్మీనగర్, గణేష్ నగర్, కోతిరాంపూర్, కట్టరాంపూర్, మంకమ్మతోట, విద్యానగర్, కొత్తయశ్వాడ, రాంనగర్, సుభాష్ నగర్, కార్ఖానగడ్డ, కిసాన్ నగర్, కాపువాడ తదితర ఏరియాల్లోని జంక్షన్లల్లో మహిళలు భారీగా పాల్గొని ఆడిపాడారు.
- నెట్వర్క్, వెలుగు