ఖమ్మం జిల్లాలో వాడవాడలా ఎంగిలిపూల బతుకమ్మ

ఖమ్మం జిల్లాలో వాడవాడలా ఎంగిలిపూల బతుకమ్మ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలుచోట్ల అమావాస్య నాడు బుధవారం బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలైంది. తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఖమ్మం, కొత్తగూడెం, జూలూరుపాడు, ములకలపల్లి, పాల్వంచతోపాటు పలుచోట్ల రంగురంగుల పూలతో ఎంగిలిపూల బతుకమ్మను పేర్చారు. 

పెద్ద సంఖ్యలో బతుకమ్మలను కాలనీల్లోని ఆలయాలు, కూడళ్ల వద్దకు చేర్చి మహిళలు, యువతులు, చిన్నారులు ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలను చెరువు, కుంటల్లో వదిలారు.      - నెట్​వర్క్, వెలుగు