ఫిబ్రవరిలో శుభ ముహూర్తాలు ఇవే...

ఫిబ్రవరిలో శుభ ముహూర్తాలు ఇవే...


సాధారణంగా మనం ఏవైనా పూజలు, వ్రతాలు చేసేటప్పుడు శుభ ముహూర్తం(Subha Muhurtham)లో చేయాలి అనే పదాన్ని వినే ఉంటాం.  చిన్నప్పటి నుంచి ఈ పదాన్ని ఎక్కువ సార్లు వింటూ ఉన్నా దీనికి సరైన అర్థం మాత్రం చాలామందికి తెలియదు.పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఏ పని ప్రారంభించాలన్నా  పండితులు దగ్గరకు వెళ్లి మంచి రోజు.. ముహూర్తం అడుగుతుంటారు. 2024 ఫిబ్రవరి 1, గురువారం ప్రారంభమవుతుంది. పండితులు తెలిపిన వివరాల  ప్రకారంఫిబ్రవరిలో   ఏ శుభ ముహూర్తాలు ఉన్నాయో  తెలుసుకుందాం.

ఫిబ్రవరిలో వివాహానికి 11 రోజులు, గృహప్రవేశానికి 5 రోజులు, పుట్టు వెంట్రుకలు తీయడానికి 3 రోజులు, జంద్యం ధరించడానికి..  5 రోజులు, కొత్తగా వ్యాపారం ప్రారంభించడాకి 4 రోజులు శుభప్రదంగా ఉన్నాయి.

 వివాహాలకు

4 వ తేది ఆదివారం,6 వ తేది  మంగళవారం,7 వతేది  బుధవారం,8 వ తేది గురువారం, 12 వ తేది సోమవారం , 13వ తేది  మంగళవారం , 17 శనివారం , 24 శనివారం , 25 ఆదివారం  , 26 సోమవారం , 29 గురువారం  వివాహాలకు శుభ సమయం ఉంది.

 గృహ ప్రవేశ ముహూర్తం

  • 12 సోమవారం, 14  బుధవారం, 19  సోమవారం, 26  సోమవారం 28  బుధవారం

 కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు... 

  • 4  ఆదివారం, 12  సోమవారం, 12  సోమవారం, 15  గురువారం, 15  గురువారం, 22  గురువారం

పుట్టు వెంట్రకలు తీయుటకు

  • 21  బుధవారం  22 గురువారం, 29  గురువారం

 జంద్యం (పవిత్ర దారం) 

  • 11ఆదివారం, 12 సోమవారం,  14  బుధవారం,19  సోమవారం, 29  గురువారం