ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

2024 ఫైనాన్షియల్ ఇయర్ ITR ఫైలింగ్ గడువు 2024 జూలై 31తో ముగియనుంది. ఆదాయపు పన్ను రిటర్న్  అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి. సరైన డాక్యుమెంట్లు అవసరం. ఐటీఆర్ ఫైలింగ్ చేసేటప్పుడు ఉద్యోగి అయినా, వ్యాపారి అయినా టాక్స్ పేయర్స్ మీ ఆదాయానికి రుజువులకు సంబంధించిన తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇవి ఐటీఆర్ ఫైలింగ్ లో ముఖ్యమైన డాక్యుమెంట్లు. 

ITR ఫైలింగ్ కు కావాలి ముఖ్యమైన డాక్యుమెంట్లు 

పాన్ కార్డ్ : మీ ITR ఫైల్ చేయడానికి మీ పాన్ తప్పనిసరి. ఇది TDS తగ్గింపు కోసం ఉపయోగించబడుతుంది. ప్రత్యక్ష ఆదాయపు పన్ను రీఫండ్‌ల కోసం మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సవరణ ప్రకారం.. ఒకవేవేళ పాన్ కార్డు లేకపోతే ITR ఫైల్ చేయడానికిి ఆధార్ నంబర్ ను కూడా ఉపయోగించవచ్చు. 

ఆధార్ కార్డ్: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA ప్రకారం..ITR ఫైల్ చేసేటప్పుడు తప్పనిసరిగా మీ ఆధార్ వివరాలను అందించాలి. ఆధార్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ ఇంకా అందుకోకుంటే మీ ITRలోని ఎన్‌రోల్‌మెంట్ IDని ఉపయోగింవచ్చు. పాన్, ఆధార్ లింక్ చేయాలి. ఆధార్, పాన్ కార్డుతో లింక్ చేయబడిన ఫొన్ నంబర్ కు వచ్చిన OTP ద్వారా ITR ఆన్‌లైన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. 

ఫారం 16 : ఈ పత్రం మీ యజమానిచే జారీ చేయబడుతుంది. మీ జీతం , TDS (మూలం వద్ద పన్ను మినహాయించబడింది) వివరాలను కలిగి ఇందులో తెలపాల్సి ఉంటుంది. ITR ఫైల్ చేసే జీతం పొందే వ్యక్తులకు ఇది కీలకం. ఫారమ్ 16 రెండు భాగాలను కలిగి ఉంటుంది. పార్ట్ A యజమాని ద్వారా పన్ను మినహాయించబడిన వివరాలను కలిగి ఉంటుంది, పార్ట్ B జీతం వంటి TDS లెక్కలను కవర్ చేస్తుంది.

ఫారం-16A/ ఫారం-16B/ ఫారం-16C : జీతాలు కాకుండా ఇతర ఆదాయాలపై TDS కోసం ఈ ఫారంలు అవసరం. ఫారం 16B ఫారం ఆస్తి లావాదేవీలు 16C అద్దె ఆదాయానికి సంబంధించినవి. ఫారం 16A బ్యాంకుల వంటి డిడక్టర్‌లచే జారీ చేయబడుతుంది. 

బ్యాంక్ ఖాతా వివరాలు : మీరు ఐటీ రిటర్న్ ల కోసం ఒక ఖాతాను పేర్కొంటూ ITRలో అన్ని యాక్టివ్ బ్యాంక్ ఖాతాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాలి. పొదుపు ఖాతాలు లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పొందిన వడ్డీని నివేదించడానికి బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు లేదా పాస్‌బుక్‌లు అవసరం.

ఫారమ్ 26AS : ఇది మీ పాన్‌పై జమ చేసిన పన్నులను చూపే వార్షిక పన్ను ప్రకటన. ఇది బ్యాంకులు, యజమానులు లేదా ఇతర సంస్థల నుండి TDS వివరాలను ఇవ్వబడతాయి. క్రెడిట్‌లను సరిగ్గా క్లెయిమ్ చేయడానికి అన్ని తగ్గింపులు మీ రికార్డులతో సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి.

హోమ్ లోన్ స్టేట్‌మెంట్: హోమ్ లోన్ ప్రిన్సిపల్, వడ్డీ చెల్లింపుల వివరాలు ఐటీ రిటర్స్ దాఖలుకు కీలకం. మీరు గృహ రుణం తీసుకున్నట్లయితే ఆర్థిక సంస్థల నుంచిస్టేట్‌మెంట్‌లను తప్పనిసరిగా తీసుకోవాలి. 

పన్ను ఆదా చేసే డాక్యుమెంట్లు : FDలు (ఫిక్స్‌డ్ డిపాజిట్లు) లేదా ELSS (ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్) వంటి పన్ను ఆదా చేసే పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లు చాలా కీలకం. వీటిని తప్పని సరిగా ఐటీ రిటర్న్ ఫైలింగ్ కు ముందు సిద్ధం చేసుకోవాలి.