సంఖ్యా శాస్త్రం ప్రకారం2024వ సంవత్సరం చాలా కీలకమైనది. 2024 వ వసంవత్సరం బృహస్పతి దేశాన్ని పరిపాలిస్తాడని నిపుణులు చెబుతున్నారు. 2024 మే 16 వ తేదీ మధ్యాహ్నం 1:20 గంటలకు బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే శని భగవానుడు కుంభరాశిలో ప్రత్యక్షంగా సంచరిస్తున్నాడు. 2024లో శని, గురు గ్రహాల వలన ఏరాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. పనిలో విజయం సాధిస్తారు. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయవచ్చు. మీరు కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందుతారు. ఆర్థిక లాభం ఉంటుంది. జీవిత భాగస్వామితో సుఖంగా గడుపుతారు.
వృషభ రాశి
ఈ రాశి వారికి 2024 అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిన పనులు ఇప్పుడు ప్రారంభమవుతాయి. కొత్త వ్యాపారాలతో పాటు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త ఉద్యోగం వస్తుంది.
మిధున రాశి
మిథున రాశి వారికి ఈ సమయం వరంలాంటిది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది
కర్కాటక రాశి
ఈ రాశి వారికి 2024 జాన్తరువాత వృత్తి, వ్యాపారంలో మార్పులు సంభవిస్తాయి. ప్రమోషన్లు రావడం... గుర్తింపు పొందడంతో మీరు చాలా ఆనందంగా జీవితం గడుపుతారు. బాధ్యతలు పెరగడంతో సహోద్యోగుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. విదేశీ చదువులకు అనుకూలమైన కాలం. ఆర్ధిక పరంగా లాభదాయకంగా ఉంటుంది.
సింహరాశి
ఈ రాశి వారు 2024లో దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మీరు చేసే వృత్తి వ్యాపారంలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. మీ తెలివితేటలను ఉపయోగించి ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఎక్కువుగా శారీరక శ్రమ పడే అవకాశం ఉన్నందున ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి. విద్యార్థుల కెరీర్ కు సంబంధించి పురోగతిని సాధిస్తారు.
కన్య రాశి
ఈ రాశివారికి 2024 వ సంవత్పరంలో శుభ ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక కోణం బలంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం విద్యార్థులకు వరం కంటే తక్కువ కాదు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
తులారాశి
2024 వ సంవత్సరంలో తులరాశి వారు శుభవార్తలు వింటారు. మీకు విదేశాల్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీరు కారు లేదా ల్యాండ్ లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదృష్టం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ లవ్ సక్సెస్ అవుతోంది.
వృశ్చిక రాశి
2024 మీకు అద్భుతంగా ఉండబోతుంది. మీరు కెరీర్‌లో ఎవరూ ఊహించని స్థాయికి వెళతారు. వ్యాపారవేత్తలు కొత్త సంవత్సరం భారీగా లాభాలను ఇస్తుంది. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు లక్ కలిసి వస్తుంది. 2023లో వచ్చిన కష్టాలు రాబోయే సంవత్సరంలో తొలగిపోతాయి.
ధనుస్సు రాశి
ఈ రాశి వారు 2024 వ సంవత్పరంలో శుభ ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు శుభ ఫలితాలు పొందుతారు.
మకర రాశి
ఈ రాశి వారికి 2024లో మంచి అవకాశాలు వస్తాయి. వృత్తి, వ్యాపారంలో అనుకున్న విజయాలకు దగ్గరగా ఉంటారు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ వ్యవహారంలో కొన్ని చిక్కులు తప్పవని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి 2024 వ సంవత్సరంలో చాలా మేలు కలుగుతుంది. ఫిబ్రవరి 14, 2024 మీ జీవితంలో ఒక ప్రాముఖ్యతను సూచిస్తుంది. సమాజంపై మీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారంలో ప్రమోషన్లు ఉంటాయి. అయితే వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దు. నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
మీన రాశి
సంవత్సరం ప్రారంభం మీ కెరీర్‌కు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ కెరీర్‌ను కొత్త శిఖరాలకు నడిపిస్తుంది. మీరు మీ లక్ష్యాల పట్ల విపరీతమైన అంకితభావం మరియు మనస్సాక్షితో మీ పని చేస్తారు. మీరు మీ పనిని పూర్తి నిజాయితీతో నిర్వహిస్తారు. జనవరి నుండి మార్చి వరకు సంవత్సరం ప్రారంభంలో మీరు భారీ ఉద్యోగాన్ని పొందవచ్చు. మీరు పనిపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఉన్నతాధికారులు మీ పట్ల సంతృప్తిగా కనిపిస్తారు.