3 బెర్తులు.. 6 జట్లు..ప్లేఆఫ్స్ కోసం పోటాపోటీ

3 బెర్తులు.. 6 జట్లు..ప్లేఆఫ్స్ కోసం పోటాపోటీ

అత్యంత ఆసక్తిగా జరుగుతున్న ఐపీఎల్​లో ఇప్పటికి కోల్‌కతా మాత్రమే ప్లేఆఫ్స్‌ బెర్తు కైవసం చేసుకుంది.  పంజాబ్‌ కింగ్స్, ముంబై, గుజరాత్ ఇంటిదారి పట్టాయి. మరో మూడు ప్లేఆఫ్స్​ బెర్తుల కోసం హైదరాబాద్​ సహా 6 జట్లు పోటీలో నిలిచాయి.

అత్యంత ఆసక్తిగా జరుగుతున్న ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లీగ్ దశ చివరి వారానికి చేరుకుంది. లీగ్ దశలో మరో ఏడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మాత్రమే మిగిలున్నాయి. ఇప్పటికి కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నైట్ రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే ప్లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్తు కైవసం చేసుకుంది.  చివరి రెండు స్థానాల్లో  ఉన్న పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింగ్స్, ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేసు నుంచి వైదొలిగాయి.  కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్ వాన కారణంగా రద్దవడంతో గుజరాత్ టైటాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇంటిదారి పట్టింది. ప్రస్తుతం 13 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 11 పాయింట్లతో ఏడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఆ జట్టు చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచినా 13 పాయింట్లకు వస్తుంది.

ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 14 పాయింట్లు అవసరమైన నేపథ్యంలో ఆ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖేల్ ఖతమైంది.  మిగతా మూడు బెర్తుల కోసం  ఆరు జట్లు పోటీ పడుతున్నాయి.  చెరో 14 పాయింట్లతో  సీఎస్కే, హైదరాబాద్ 3,4వ స్థానాల్లో ఉన్నాయి. 12 పాయింట్లతో  బెంగళూరు, ఢిల్లీ , లక్నో వరుసగా 5, 6,7 స్థానాల్లో రేసులో నిలిచాయి. రాజస్తాన్, హైదరాబాద్, లక్నో మరో రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడాల్సి ఉండగా.. సీఎస్కే, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ, ఢిల్లీకి ఒక్కో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లే మిగిలున్నాయి. 

రాయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మెండుగా

వరుస విజయాలతో దూసుకెళ్లిన రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గత మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఓడింది. ప్రస్తుతం16 పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నందున ఆ టీమ్ కూడా ప్లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్తుకు ఇబ్బంది లేనట్లే. పంజాబ్ కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (15న), కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నైట్ రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (19న)తో జరిగే చివరి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో గెలిస్తే టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌ సాధిస్తుంది. ఒక్కటి గెలిచినా 18 పాయింట్లతో  ముందుకెళ్తుంది. ఒకవేళ రెండింటిలో ఓడినా ఆ టీమ్ రేసులో నిలుస్తుంది. కాకపోతే రన్ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. 

చెన్నై x ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ 

ఈ నెల 18న బెంగళూరులో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీతో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిస్తే చెన్నై 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేరనుంది. అప్పుడు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ 12 పాయింట్లతో ఇంటిదారి పడుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ గెలిస్తే ఇరు జట్లూ చెరో 14 పాయింట్లతో నిలుస్తాయి. అప్పుడు సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఢిల్లీ, లక్నో ఫలితాలతో పాటు రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలకం కానుంది. 

లక్నోకు చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఢిల్లీకి కష్టమే

మరో రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మిగిలున్న లక్నో మంగళవారం ఢిల్లీతో పోటీ పడనుంది. ఇందులో లక్నో గెలిస్తే ఓడితే ఢిల్లీ ఇంటిదారి పడుతుంది. ఢిల్లీ నెగ్గితే14 పాయింట్లకు వస్తుంది.  కానీ ప్రతికూల రన్ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (–0.482) ఉన్న నేపథ్యంలో భారీ తేడాలో నెగ్గితేనే ఆ టీమ్ రేసులో ఉంటుంది. లక్నో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలవడంతో పాటు 17న జరిగే తమ చివరి పోరులో ముంబైపై నెగ్గితే 16 పాయింట్లకు చేరుకుంటుంది. అప్పుడు సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ రెండు మ్యాచ్‌‌‌‌ల్లో

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ చేతిలో చెన్నై ఓడిపోతే లక్నో నేరుగా ముందంజ వేస్తుంది. రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్కటి గెలిచినా.. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీని చెన్నై ఓడించి, రాజస్తాన్ తర్వాతి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఓడితే నాలుగు జట్లూ తలో 16 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు రన్ రేట్ కీలకం అవుతుంది. తక్కువ రన్‌‌‌‌‌‌‌‌ రేట్ (–0.76) నేపథ్యంలో లక్నోకు చివరి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో భారీ విజయాలు అవసరం.

సన్ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్కటి గెలిచినా!

ప్రస్తుతం 12 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఏడు విజయాలు సాధించిన సన్ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ నెల 16న గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో, 19న పంజాబ్ కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  పోటీ పడనుంది. ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడే ఈ  రెండింటిలో గెలిస్తే 18 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది.  ఒక్క దాంట్లో  గెలిచి రన్‌‌‌‌‌‌‌‌ రేట్ పెంచుకున్నా 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరే చాన్సుంది. ఒకవేళ రెండింటిలో ఓడినా కూడా హైదరాబాద్ రేసులో ఉంటుంది. కానీ, భారీ తేడాతో ఓడకుండా చూసుకోవాలి.

అప్పుడు రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేఆఫ్స్ చేరాలంటే సీఎస్కేపై ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ, లక్నోపై ఢిల్లీ తక్కువ తేడాతో గెలవాలి. లక్నో తమ చివరి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఓడాలి లేదంటే ఒకదాంట్లో ఓడి మరోదాంట్లో తక్కువ మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నెగ్గాలి. అప్పుడు  ఈ జట్లన్నీ 14 పాయింట్లతో నిలుస్తాయి. మంచి రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న రెండు జట్లు ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరుతాయి.