అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రోజుగా జులై 22

అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రోజుగా జులై 22

గత 84 సంవత్సరాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రోజుగా 2024, జులై 22 రికార్డు సృష్టించింది. ఈ రోజున ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.15 డిగ్రీలుగా నమోదైనట్లు యూరోపియన్​ యూనియన్​కు చెందిన కోపర్నికస్​ క్లైమేట్​ చేంజ్​ సర్వీస్​ (సీ3ఎస్​) తెలిపింది. జులై 21న 17.09 డిగ్రీల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత నమోదయింది. ఆ తర్వాత రోజే అంతకుమించి ఉష్ణోగ్రత  నమోదైంది.

1940 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రోజు ఈ ఏడాది జులై 22 అని సీ3ఎస్​ తెలిపింది.  గత ఏడాది జులై 6న అత్యధికంగా 17.08 డిగ్రీల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత నమోదైంది. గత ఏడాది జూన్​ నెల నుంచి వరుసగా 13 నెలలుగా ప్రతి నెలా ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయని సీ3ఎస్​ పేర్కొంది.