2024 సంవత్సరానికిగానూ యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ క్రీడా అవార్డులు ప్రకటించింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుకు నలుగురు క్రీడాకారులను ఎంపిక చేసింది. డబుల్ ఒలింపిక్ విజేత మను భాకర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేష్, భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా ఒలింపిక్స్ స్వర్ణ విజేత ప్రవీణ్ కుమార్‌లు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికయ్యారు.
ఇక 32 మందిని అర్జున అవార్డు వరించగా.. వీరిలో 17 మంది పారా అథ్లెట్లు ఉన్నారు. ఐదుగురికి ద్రోణాచార్య అవార్డు, ఇద్దరు క్రీడాకారులను జీవితకాల అర్జున అవార్డు గ్రహీతలుగా ప్రకటించారు. వీరందరికి జనవరి 17న రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేయనున్నారు.
ఖేల్ రత్న అవార్డు 2024 విజేతలు
- 1. డి గుకేశ్: చెస్
- 2. హర్మన్‌ప్రీత్ సింగ్: హాకీ
- 3. ప్రవీణ్ కుమార్: పారా అథ్లెటిక్స్
- 4. మను భాకర్: షూటింగ్
అర్జున అవార్డు విజేతలు
- 1. జ్యోతి యర్రాజి: అథ్లెటిక్స్
- 2. అన్నూ రాణి: అథ్లెటిక్స్
- 3. నీతూ: బాక్సింగ్
- 4. సావీటీ: బాక్సింగ్
- 5. వంటికా అగర్వాల్: చదరంగం
- 6. సలీమా టెటే: హాకీ
- 7. అభిషేక్: హాకీ
- 8. సంజయ్: హాకీ
- 9. జర్మన్‌ప్రీత్ సింగ్: హాకీ
- 10. సుఖజీత్ సింగ్: హాకీ
- 11. రాకేష్ కుమార్: పారా ఆర్చరీ
- 12. ప్రీతి పాల్: పారా అథ్లెటిక్స్
- 13. జీవన్‌జీ దీప్తి: పారా అథ్లెటిక్స్
- 14. అజిత్ సింగ్: పారా అథ్లెటిక్స్
- 15. సర్జేరావు ఖిలారీ: పారా అథ్లెటిక్స్
- 16. ధరంబీర్: పారా అథ్లెటిక్స్
- 17. ప్రణవ్ సూర్మ: పారా అథ్లెటిక్స్
- 18. హెచ్ హోకాటో సెమా: పారా అథ్లెటిక్స్
- 19. సిమ్రాన్: పారా అథ్లెటిక్స్
- 20. నవదీప్: పారా అథ్లెటిక్స్
- 21. నితీష్ కుమార్: పారా బ్యాడ్మింటన్
- 22. తులసిమతి మురుగేశన్: పారా బ్యాడ్మింటన్
- 23. నిత్య శ్రీ శివన్: పారా బ్యాడ్మింటన్
- 24. మనీషా రామదాస్: పారా బ్యాడ్మింటన్
- 25. కపిల్ పర్మార్: పారా జూడో
- 26. మోనా అగర్వాల్: పారా షూటింగ్
- 27. రుబీనా ఫ్రాన్సిస్: పారా షూటింగ్
- 28. స్వప్నిల్ సురేష్ కుసలే: షూటింగ్
- 29. సరబ్జోత్ సింగ్: షూటింగ్
- 30. అభయ్ సింగ్: స్క్వాష్
- 31. సజన్ ప్రకాష్: స్విమ్మింగ్
- 32. అమన్: రెజ్లింగ్
ద్రోణాచార్య అవార్డు 2024 విజేతలు
ఐదుగురు కోచ్‌లను ద్రోణాచార్య అవార్డు వరించింది.
- 1. సుభాష్ రాణా: పారా షూటింగ్
- 2. దీపాలి దేశ్‌పాండే: షూటింగ్
- 3. సందీప్ సాంగ్వాన్: హాకీ
- 4. ఎస్ మురళీధరన్: బ్యాడ్మింటన్
- 5. అర్మాండో ఆగ్నెలో కొలాకో: ఫుట్ బాల్
జీవితకాల అర్జున అవార్డు విజేతలు
ఇద్దరు క్రీడాకారులను జీవితకాల అర్జున అవార్డు గ్రహీతలుగా ప్రకటించారు.
- 1. సుచా సింగ్: అథ్లెటిక్స్
- 2. మురళీకాంత్ రాజారాం పేట్కర్: పారా స్విమ్మింగ్