లోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. జనవరి 13 నుంచి మోదీ దూకుడు

లోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. జనవరి 13 నుంచి మోదీ దూకుడు

లోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. 2024 జనవరి 13నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలల ప్రచారం మొదలుపెట్టనున్నట్లుగా తెలుస్తోంది.  బీహార్‌లోని రామన్ మైదాన్‌లో జరిగే ర్యాలీతో వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని  మోదీ ప్రారంభించే అవకాశం ఉంది. బీహార్ పర్యటనలో మోదీ జనవరి 13న  పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనతోనే మోదీ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయనున్నారు.  

బీహార్ లో 40 స్థానాలపై బీజేపీ ఫోకస్ చేసింది. రాష్ట్రంలోని బేగూసరాయ్‌, బెతియా, ఔరంగాబాద్‌లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఇక కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చే రెండు నెలల్లో బిహార్‌లో అనేక సభల్లో పాల్గొననున్నారు.  నడ్డా..  సీతామఢి, మధేపురా, నలందాల్లో అమిత్‌షా పాల్గొననుండగా సీమాంచల్‌లో జేపీ నడ్డా పర్యటించనున్నారు. 

కేంద్రంలో మోదీ సర్కార్ ను కూల్చేందుకు విపక్షంలో ఇండియా కూటమిలో బీహార్ సీఎం  నితీష్ కుమార్ ఉన్నారు.  2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా నితీశ్ కుమార్ ప్రతిపక్ష నేతలను ఏకతాటిపైకి తెచ్చారు. కాగా బీహార్ లో గత ఎన్నికల్లో ఇక్కడ గత ఎన్నికల్లో ఎన్‌డిఎ 39 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ ఒక్కటి గెలుచుకుంది.