2024 మార్సిడెజ్ GLSను భారతదేశ మార్కెట్ లోకి విడుదల చేశారు. 2023 ఏప్రిల్ లో ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించబడిన ఈ ఫేస్ లిఫ్టెట్ మోడల్ కొత్త కొత్త ఫీచర్లతో లోపల, బయట అద్భుతమైన అప్ డేట్ లతో భారత దేశ మార్కెట్ లోకి వచ్చింది.
మెర్సిడెజ్ బెంజ్ కారు ఫీచర్లు:
డివైజ్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, సిల్వర్ షాడో ఫినిషఇంగ్ లో నాలుగు కొత్త హారిజాంటల్ లౌవల్ లు అప్ గ్రేడ్ చేయబడ్డాయి. రీస్టైల్ చేయబడిన హెడ్ ల్యాంప్ లతో గ్రిల్ చుట్టబడి ఉంటుంది. అదనంగా ఎయిర్ ఇన్ లెట్ గ్రిల్స్, హై గ్లోస్ బ్లాక్ సరౌండ్ లతో కూడిన కొత్త ఫ్రంట్ బంపర్, కొత్త టెయిల్ ల్యాంప్ లు, మూడు హారిజాంటల్ బ్లాక్ ప్యాటర్న్ లతో చూడగానే ఇట్టే ఆకట్టుకునే విధంగా Mercides Benz GLS ఫీచర్లు ఉన్నాయి.
Mercedes Benz GLS పెట్రోల్, డీజిల్ రెండు 3.0 L ఇంజన్ ను కలిగి ఉంది. 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఎయిర్ మేటిక్ సస్పెన్షన్, 13- స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, వెంటిలేడెట్ సీట్లతో అద్బుతమై ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. భారత్ లో కేవలం ఏడు సీట్ల Mercedes Benz GLS సేల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఐదు జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ ఫఓన్ ఛార్జర్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, వెంటిలేటింగ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ సెకండ్ రో సీట్లు, 360 డిగ్రీ కెమెరాతో కూడిన పార్కింగ్ ప్యాకేజీ, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఎన్నో అద్భుత ఫీచర్లు GLS లో అందించబడ్డాయి.
9 ఎయిర్ బ్యాగ్ లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ , టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి భద్రతా పరమైన ఫీచర్లు ఉన్నాయి.
- Mercedes GLS 450 ( పెట్రోల్) కారు ధర రూ. 1.32 కోట్లు(ఎక్స్ షోరూమ్ )
- Mercedes GLS 450 ( డీజిల్) కారు ధర రూ. 1.37 కోట్లు (ఎక్స్ షోరూమ్ )