ఖాతాదారులారా.. నవంబర్‌లో మీకేమైనా ముఖ్యమైన బ్యాంకు పనులున్నాయా..! అయితే, మీకోసమే ఈ కథనం. ఒక్క నవంబర్ నెలలోనే దాదాపు 13 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. కావున సెలవు దినాలు ఏయే ఏయే తేదీలలో అనేది తెలుసుకొని.. అందుకు అనుగుణంగా పనులు చెక్కబెట్టుకోగలరు. కాకపోతే, ఈ సెలవుల సంఖ్య రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. గమనించగలరు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పండగలు, రాష్ట్ర పండగల రోజుల్లో అక్కడ సెలవు ఇస్తుంటారు. అందుకే ఈ మనవి.
నవంబర్‌లో బ్యాంకుల సెలవుల జాబితా
- నవంబర్ 1: దీపావళి అమావాస్య/ (లక్ష్మీ పూజ)
- నవంబర్ 2: దీపావళి (బలి ప్రతిపద)/ గోవర్ధన్ పూజ/విక్రమ్ సంవంత్ నూతన సంవత్సరం రోజు
- నవంబర్ 3: ఆదివారం
- నవంబర్ 7: ఛట్ పూజ
- నవంబర్ 8: ఛట్ పూజ/ వంగల పండుగ
- నవంబర్ 9: రెండవ శనివారం
- నవంబర్ 10: ఆదివారం
- నవంబర్ 12: ఎగాస్-బగ్వాల్
- నవంబర్ 15: గురునానక్ జయంతి/ కార్తీక పూర్ణిమ
- నవంబర్ 17: ఆదివారం
- నవంబర్ 18: కనకదాస జయంతి
- నవంబర్ 23: సెంగ్ కుట్స్నెమ్, నాల్గవ శనివారం
- నవంబర్ 24: ఆదివారం
రాష్ట్రాల వారీగా సెలవులు
నవంబర్ 1: దీపావళి అమావాస్య సందర్భంగా త్రిపుర, కర్ణాటక, ఉత్తారఖండ్, మాహారాష్ట్ర, సిక్కిం, మేఘాలయా, జమ్మూకశ్మీర్, మణిపూర్ రాష్ట్రాలలో బ్యాంకులకు సెలవు.
నవంబర్ 7 & 8: ఛత్ పూజ - బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో బ్యాంకులకు సెలవు.
నవంబర్ 15: గురునానక్ జయంతి - బహుళ రాష్ట్రాలలో సెలవులు.
నవంబర్ 18 & 23: కర్ణాటక, మేఘాలయలో ప్రాంతీయ సెలవులు.
సెలవుల పూర్తి జాబితా కోసం RBI హాలిడే క్యాలెండర్‌ని చూడవచ్చు. క్యాలెండర్ కోసం BANK Holidays ఇక్కడ క్లిక్ చేయండి.