నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​లో నుమాయిష్​.. మస్త్ ఎంజాయ్

  •     సంక్రాంతి సెలవులతో పెరిగిన రద్దీ
  •      స్టాళ్లు, గేమ్స్​జోన్​లో ఫుల్ జోష్

హైదరాబాద్, వెలుగు : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​లో నుమాయిష్ ​సందడిగా సాగుతుంది. సంక్రాంతి పండుగ సెలవులతో శుక్రవారం రద్దీ పెరిగింది. చిన్నా, పెద్దా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వ్యాపారులు ఏర్పాటు చేసిన స్టాళ్లు సిటీవాసులను ఆకట్టుకున్నాయి. ప్రధానంగా మహిళలను కశ్మీర్​గార్మెంట్స్, బ్యాంగిల్స్, కాస్మోటిక్స్​, కిడ్స్​ డ్రెస్సెస్ ఆకట్టుకున్నాయి.

కిడ్స్ గేమ్స్ పిల్లలు ఉత్సాహం చూపుతున్నారు. నుమాయిష్​ చరిత్రలో అతిపెద్ద ఫిష్​ టన్నెల్​ అక్వేరియంను ఏర్పాటు చేశారు. ఇందులో వందకుపైగా రకరకాల ఫిష్​లు చూపరులను ఆకర్షిస్తున్నాయి. వాటర్​బోట్​వద్ద పిల్లలు ఎంజాయ్​చేస్తున్నారు. జెయింట్ వీల్​, టాయ్​ కార్​డ్రైవింగ్​ఇతర ఆటల స్టాళ్ల వద్ద రద్దీ ఉంటుంది. నుమాయిష్​ ట్రెయిన్​లో జర్నీ చేస్తూ.. సందర్శకులు ఎక్కువగా ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. 

  స్పెషల్​ఎట్రాక్షన్ ట్రాన్స్​జెండర్స్​స్టాల్స్ 

ఈ ఏడాది ఏర్పాటు చేసిన ట్రాన్స్​జెండర్స్​స్టాల్స్​ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.  సిటీకి చెందిన ట్రాన్స్​జెండర్స్ కిరణ్ రాజ్, సోనమ్​, ట్రాన్స్​ఉమెన్​నందిని రెండు స్టాళ్లను ఏర్పాటు చేయగా..  వీరిని క్వీర్​బంధు పేరెంట్స్​ అసోషియేషన్​ ముకుంద మాల ప్రోత్సహిస్తున్నారు. స్మాల్ ఇండస్ట్రీస్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(సిడ్బీ) సహకారం స్టాళ్లు ఏర్పాటు చేశారు.  ఈ స్టాళ్లలో హ్యాండ్​మేడ్​జూట్​ బ్యాగ్స్, సోప్స్​, బ్లౌజ్​పీసెస్​ను సేల్​ అమ్ముతున్నారు. ‘‘ట్రాన్స్​జెండర్స్​పై చిన్నచూపు ఉందని, తాము తక్కువ కాదని చెప్పేందుకే స్వయం ఉపాధిని ఎంచుకుని ట్రాన్స్​స్టాళ్లను ఏర్పాటుచేసినట్టు,  ఈ నెల 18 వరకే కొనసాగిస్తామని ట్రాన్స్ జెండర్స్​తెలిపారు. 

సర్వీసెస్​ స్టాల్స్​ కూడా...

 షీ టీమ్స్​ ఆధ్వర్యంలో పోలీసులు స్టాల్​ను ఏర్పాటు చేశారు. ఉమెన్స్​ఈవ్​టీజింగ్, వేధింపులను ఎలా ఎదుర్కోవాలో మహిళలకు వివరిస్తూ షీ టీమ్స్​సభ్యులు అవగాహన కల్పిస్తున్నారు.  తెలంగాణ స్టేట్​ లీగల్​సర్వీసెస్​ అథారిటీ ఆధ్వర్యంలో  ఏర్పాటైన భరోసా సెంటర్ లో మనస్పర్థలు తలెత్తిన భార్యభర్తలు, ఇతర కారణాలతో వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ స్టాల్​లో ప్రజలకు ఉచిత న్యాయ సలహా అందిస్తున్నారు.  ప్రతిరోజూ ఇద్దరు న్యాయవాదులు లోక్​అదాలత్​సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సైబర్​పోలీసుల ఆధ్వర్యంలో స్టాల్​ను ఏర్పాటు చేయగా..  సైబర్​ మోసాలకు గురికాకుండా సందర్శకులను అవేర్​చేస్తున్నారు .

లీగల్ ​హెల్ప్ కోసం వచ్చా..  

కోర్టు నుంచి నా భార్య పేరు మీద నోటీసులు వచ్చాయి. ఆవిడ నడవలేని స్థితిలో ఉన్నారు. ఏమి చేయాలో తెలియట్లేదు. నుమాయిష్​లో ఫ్రీ లీగల్​ హెల్ప్ ​అని తెలిసింది. అందుకే ఇక్కడికి వచ్చా. బయట లాయర్ల వద్ద సలహా తీసుకోవాలంటే డబ్బులు అడుగుతున్నారు. ఈ ఫ్రీ సౌకర్యం బాగుంది.

– ఎంఎం రెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయ్, హైదరాబాద్​  

సైబర్ ఫ్రాడ్స్ పై అవగాహన కల్పిస్తున్నం 

 రోజురోజుకు సైబర్ ​మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రజలకు అవగాహన అవసరం. అందుకే సైబర్​ క్రైమ్​ పోలీసుల ఆధ్వర్యంలో స్టాల్​ను ఏర్పాటు చేశాం. ప్రజలు కూడా అనవసరమైన లింక్స్​ యాప్స్​ ఓపెన్​ చేయకూడదు. 

– శ్రీనివాస్ రావు, సైబర్​క్రైమ్ హెడ్ కానిస్టేబుల్​