పాకిస్తాన్ అంటే పాకిస్తానే.. అక్కడ ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యమే.. ఆర్మీ అధికారంలో ఉంటుందా.. పొలిటికల్ పార్టీలు అధికారంలో ఉంటాయా అనేది ఎవరూ చెప్పలేరు.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలగింపు, జైలుకు పంపించిన తర్వాత.. ఫిబ్రవరి 8న పాకిస్తాన్ జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఒకవైపు ఈ పోలింగ్ జరగుతుండగానే.. మరోవైపు రిగ్గింగ్ మొదలైంది.
పాకిస్తాన్ రూరల్ ప్రాంతాల్లో ఏ పార్టీకి పట్టు ఉంటే ఆ పార్టీ కార్యకర్తలు.. హోటల్ లో బిల్లు బుక్కుపై రబ్బరు స్టాంపులా.. పోలింగ్ బూతుల్లో బ్యాలెట్లపై ఓట్లు గుద్దుకున్నారు. ఏ మాత్రం టెన్షన్ లేకుండా.. చాలా ప్రశాంతంగా.. బ్యాలెట్ బాక్సుపైనే కూర్చొని. బ్యాలెట్ పేపర్లపై తమకు కావాల్సిన సింబల్ పై ఓట్లు వేసుకున్నారు. తీరిగ్గా మడతపెట్టి బాక్సుల్లో వేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Pakistan broke all records of rigging.
— Islam (@AqssssFajr) February 9, 2024
Pakistani elections 2024 for democracy.
The election administration is stamping the ballot papers for PMLN Nawaz Sharif. pic.twitter.com/0HJsS6tGnQ
ఆ దృశ్యాలపై నెటిజెన్లు జోకులు పేలుస్తున్నారు. గత ఎన్నికల సమయంలో జరిగిన రిగ్గింగ్ లను ఈ ఎన్నికలు తుడిచిపెట్టేస్తాయని కామెంట్లు చేస్తున్నారు. ఇంతోటి రిగ్గింగ్ కు పోలింగ్ పెట్టటం ఎందుకు అంటూ.. ప్రజాస్వామ్య పరిరక్షకులు అంటున్నారు. గ్రేట్ పాకిస్తాన్.. రిగ్గింగ్ పోలింగ్.. రిగ్గింగ్ లో వరల్డ్ రికార్డు.. ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ రిగ్గింగ్ పై నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ పార్టీల నేతల ఎవరికివారు కౌంటర్ చేసుకుంటున్నారు.
این اے 248 میں ایم کیو ایم کے نقاب پہنے کارکنان کی پولنگ اسٹیشن میں غندہ گردی ۔۔ پولنگ اسٹیشن نیو میتھڈ اسکول بلاک 15 ایف بی ایریا میں دھاندلی کی کوشش#Pakistan #Karachi #elections #Election2024 #Sindh #rigging #fairelections #cheating #TarazuParThappa #TarazuTheOnlyChoice pic.twitter.com/QqoZrVfBdz
— ⛰️FAtimA? (@FAtimA20202023) February 8, 2024
మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందినట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. పీటీఐ వర్గాలు సైతం అదే వెల్లడిస్తున్నాయి.