శ్రీశైలానికి మళ్లీ వరద..సాగర్ ‌‌‌‌‌‌‌‌లో ఆరు గేట్లు ఓపెన్ ‌‌‌‌‌‌‌‌

శ్రీశైలానికి మళ్లీ వరద..సాగర్ ‌‌‌‌‌‌‌‌లో ఆరు గేట్లు ఓపెన్ ‌‌‌‌‌‌‌‌
  • ఎగువ నుంచి 93,270 క్యూసెక్కుల ఇన్ ‌‌‌‌‌‌‌‌ఫ్లో
  • ఒక గేటుతో పాటు విద్యుత్ ‌‌‌‌‌‌‌‌ కేంద్రం ద్వారా 95 వేల క్యూసెక్కుల నీరు విడుదల

శ్రీశైలం, వెలుగు : శ్రీశైలం ప్రాజెక్ట్ ‌‌‌‌‌‌‌‌కు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద వస్తోంది. జులై 19 నుంచి ప్రాజెక్ట్ ‌‌‌‌‌‌‌‌కు నిరంతరాయంగా ఇన్ ‌‌‌‌‌‌‌‌ఫ్లో కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండడడంతో శ్రీశైలం ప్రాజెక్ట్ ‌‌‌‌‌‌‌‌కు మళ్లీ వరద పెరిగింది. ప్రస్తుతం ఎగువ నుంచి 93,270 క్యూసెక్కుల వరద వస్తోంది.

దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ ‌‌‌‌‌‌‌‌ ఒక గేటును పది మీటర్ల మేర ఎత్తి నీటి దిగువకు విడుదల చేస్తున్నారు. క్రస్ట్ ‌‌‌‌‌‌‌‌ గేట్ ‌‌‌‌‌‌‌‌తో పాటు రెండు జల విద్యుత్ ‌‌‌‌‌‌‌‌ కేంద్రాల ద్వారా మొత్తం 95,626 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.50 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. 

నాగార్జునసాగర్ ‌‌‌‌‌‌‌‌లో ఆరు గేట్లు ఓపెన్ ‌‌‌‌‌‌‌‌

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్ ‌‌‌‌‌‌‌‌కు ఎగువ నుంచి భారీగా ఇన్ ‌‌‌‌‌‌‌‌ఫ్లో వస్తోంది. సాగర్ ‌‌‌‌‌‌‌‌కు మొత్తం 89,678 క్యూసెక్కుల వరద వస్తుండడంతో సాగర్ ‌‌‌‌‌‌‌‌ వద్ద ఆరు క్రస్ట్ ‌‌‌‌‌‌‌‌ గేట్లను ఎత్తి 48,540 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ‌‌‌‌‌‌‌‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.50 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 589.90 అడుగుల (311.7462) మేర నీరు నిల్వ ఉంది.

సాగర్ ‌‌‌‌‌‌‌‌ నుంచి కుడి కాల్వకు 3,371 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 6,173, విద్యుత్ ‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తికి 29,394, ఎస్ ‌‌‌‌‌‌‌‌ఎల్ ‌‌‌‌‌‌‌‌బీసీకి 1,800, వరదకాల్వకు 400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.