2024 సైమా అవార్డ్స్ సొంతం చేసుకున్న తెలుగు చిత్రాలు ఇవే. 

సైమా అవార్డ్స్ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2024 ప్రధానం వేడుకలు సెప్టెంబర్ 14వ తారీఖున అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ క్రమంలో పలు తెలుగు చిత్రాలు సైమా అవార్డులు సొంతం చేసుకున్నాయి. కాగా యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మరియు నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా చిత్రానికి 4 అవార్డులు లభించాయి. ఇందులో  బెస్ట్ యాక్టర్ కేటగిరిలో నేచురల్ స్టార్ నాని, బెస్ట్ హీరోయిన్ కేటగిరీలోకీర్తి సురేష్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో శ్రీకాంత్ ఓదెల, బెస్ట్ సపోర్టింగ్ రోల్ కేటగిరిలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన దీక్షిత్ శెట్టి తదితరులకు సైమా అవార్డులు దక్కాయి.

ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి చిత్రం బెస్ట్ మూవీ కేటగిరిలో సైమా అవార్డు సొంతం చేసుకుంది.  నానీ మరియు ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న చిత్రానికి కూడా 2 అవార్డులు లభించాయి. ఇందులో ఉత్తమ నటి (క్రిటిక్స్) గా మృణాల్ ఠాకూర్ మరియు ఈ చిత్రంలో హీరో కూతురి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ ఖియారా ఖాన్ కి ఉత్తమ సహాయ నటి కేటగిరిలో అవార్డులు లభించాయి. 


అలాగే బెస్ట్ డెబ్యూ యాక్టర్ కేటగిరిలో సంగీత్ శోభన్ (మ్యాడ్), వైష్ణవి చైతన్య (బేబీ), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరిలో అబ్దుల్ వహాబ్ (హాయ్ నాన్నా, ఖుషీ), బెస్ట్ సింగర్ కేటగిరీలో రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు-బలగం), బెస్ట్ డైరెక్టర్ (క్రిటిక్స్) సాయి రాజేష్ (బేబీ), ఉత్తమ నటుడు (క్రిటిక్స్) ఆనంద్ దేవరకొండ (బేబీ) తదితరులు సైమా అవార్డులు సొంతం చేసుకున్నారు.

కాగా ఈ అవార్డుల ప్రధానం వేడుకలు సెప్టెంబర్ 15వ తారీఖు వరకు కొనసాగుతాయి.