కొత్త ఏడాదిలో మ్యాచ్‌లే మ్యాచ్‌లు..: 10కి పైగా టోర్నీలు.. 400కి పైగా మ్యాచ్‌లు

కొత్త ఏడాదిలో మ్యాచ్‌లే మ్యాచ్‌లు..: 10కి పైగా టోర్నీలు.. 400కి పైగా మ్యాచ్‌లు

మీరు క్రికెట్ ప్రేమికులా..! అయితే మీకిది పండగలాంటి వార్త. మీరు చూడాలే కానీ, కొత్త ఏడాదిలో రాత్రిపగలు అనే తేడా లేకుండా చూసే అన్ని మ్యాచ్‌లు ఉన్నాయి. మ్యాచ్ లేకుండా కనీసం 24 గంటలు గడవదంటే నమ్మండి. 2024లో క్రికెట్ షెడ్యూల్ అలా ఉంది. ద్వైపాక్షిక సిరీస్‌లు.. టీ20 వరల్డ్ కప్.. టీ20 లీగులు.. ఇలా బోలెడన్నీ మ్యాచ్‌లు ఉన్నాయి. ప్రతిక్షణం ప్రపంచంలో ఏదో ఒక మూలన మ్యాచ్ జరుగుతూనే ఉండనుంది.

ఏ ముహూర్తాన ఐపీఎల్ తీసుకొచ్చారో కానీ, ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నాలుగైదు ఫ్రాంచైజీలను పుట్టించడం.. అంతర్జాతీయ ఆటగాళ్ల మధ్య మ్యాచ్‌లు నిర్వహిండం అన్ని దేశాలకు సాధారమైపోయింది. ఒక్క ఐపీఎల్ జరిగే సమయంలో తప్ప మిగిలిన సమయంలో ఒకటి అయిపోయేలోపు మరొక టీ20 లీగ్‌ మొదలవనున్నాయి. ఏడాది ప్రారంభంలో జరిగే దక్షిణాఫ్రికా టీ20 లీగ్ నుంచి మొదలుపెడితే ఏడాది చివరన జరిగే బిగ్ బాష్ లీగ్ వరకూ పదికి పైగా టోర్నీలు జరగనున్నాయి. వీటిలో ఒక్క టోర్నీకి సగటున 40 మ్యాచ్‌ల చొప్పున వేసుకున్నా 400కి పైబడి మ్యాచ్‌లు ఉండనున్నాయి.  

2024లో టీ20 లీగ్‌లు:

  • SA20 (దక్షిణాఫ్రికా టీ20 లీగ్): జనవరి 9 -  ఫిబ్రవరి 10
  • ILT20 (ఇంటర్నేషనల్ టీ20 లీగ్): జనవరి 19 -  ఫిబ్రవరి 17
  • BPL (బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్): జనవరి 19 - మార్చి 1
  • PSL (పాకిస్తాన్ సూపర్ లీగ్): ఫిబ్రవరి 14 - మార్చి 19
  • IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్): మార్చి 23 - మే 26 (తాత్కాలిక తేదీ)
  • విటలిటీ టీ20 బ్లాస్ట్ (ఇంగ్లాండ్): మే 30 - సెప్టెంబర్ 14
  • టీ20 ప్రపంచ కప్ 2024(అమెరికా, వెస్టిండీస్) - జూన్ 4 - జూన్ 30
  • శ్రీలంక ప్రేమియర్ లీగ్: ఆగష్టు
  • హండ్రెడ్ బాల్ లీగ్ (ఇంగ్లాండ్): ఆగస్టు
  • CPL(కరేబియన్ ప్రీమియర్ లీగ్): ఆగస్టు - సెప్టెంబర్
  • టీ10 లీగ్(దుబాయ్): అక్టోబర్
  • బిగ్ బాష్ లీగ్ : డిసెంబర్ - జనవరి