
‘ది సొసైటీ ఆఫ్ ఫొటోగ్రాఫర్స్ మంత్లీ ఇమేజ్ కాంపిటీషన్’ 2024వ సంవత్సరానికి గానూ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ పోటీకి ఏడాది మొత్తంలో 6 వేలకు పైగా ఎంట్రీలు వచ్చాయి. అందులో నామినేట్ అయిన ఫొటోల్లో కొన్ని గోల్డ్ అవార్డు సాధించాయి. ఈ పోటీలో దాదాపు ముప్ఫై కేటగిరీలు ఉండగా అందులో గెలుపొందిన, నామినేట్ అయిన ఫొటోల్లో కొన్ని ఇవి.