TVS Apache 2024 మోడల్ అదుర్స్..అట్రాక్టివ్ డిజైన్, అడ్వాన్స్డ్ ఫీచర్స్

TVS Apache 2024 మోడల్ అదుర్స్..అట్రాక్టివ్ డిజైన్, అడ్వాన్స్డ్ ఫీచర్స్

TVS తన  2024 మోడల్ Apache RR310 బైక్ ని విడుదల చేసింది. అప్డేడ్ చేయబడినఈ బైక్ డిజైన్, పనితీరు, ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. TVS Apache RR 310 మూడు కలర్లతో లభిస్తుంది. రేసింగ్ రెడ్, బాంబర్ గ్రే, రేస్ రెప్లికా కలర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

 TVS కొత్త బైక్ 2024 Apache RR310 మోడల్ ధర  రూ. 2లక్షల75వేలు (ఎక్స్ షోరూమ్ ధరతో) రేసింగ్ రెడ్ కలర్ TVS Apache RR 310 ధర రూ. 2లక్షల 75వేలు, క్విక్ షిఫ్టర్ రేసింగ్ రెడ్ ధర రూ. 2లక్షల 92 వేలు కాగా.. బాంబర్ గ్రే కలర్ TVS Apache RR 310 ధర రూ. 2లక్షల 97వేలు. 

రైడర్ ఎయిడ్స్ , ఇతర ఫీచర్లతో బైక్ ను పూర్తి స్థాయిలో సామర్థ్యంతో అన్ లాక్ చేయాలంటే కస్టమర్లు బిల్డ్ టు ఆర్డర్ ఎడిషన్ ని ఎంచుకోవచ్చు. BTO ప్యాకేజీలో భాగంగా TVS రెండు కిట్‌లను అంది స్తోంది. వీటికి అదనంగా చెల్లించాల్సి ఉటుంది. డైనమిక్ కిట్  రూ. 18వేలు, డైనమిక్ ప్రోకిట్ కు రూ. 16వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రేస్ రెప్లికా కలర్ పొందడానికి ఆసక్తి ఉన్న కస్టమర్లు రూ.7వేలు అదనపు ధరతో పొందవచ్చు. 

2024 TVS అపాచీ RR 310 డిజైన్..

TVS Apache RR 310 కొత్త ఫెయిరింగ్-మౌంటెడ్ వింగ్‌లెట్‌లను కలిగి ఉంటుంది. దీనికంటే ముందు వెర్షన్ Apache RR 310 డిజైన్ తో వస్తుంది. అయితే ఫెయిరింగ్‌లో అప్డేడెట్ Apache గ్రాఫిక్స్ ఉన్నాయి. 

2024 TVS అపాచీ RR 310 ఇంజన్ పనితీరు

TVS అపాచీ RR 310 2024 మోడల్ బైక్..312cc లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్, రివర్స్ ఇంక్లైన్డ్ ఇంజన్ ద్వారా నడుస్తుంది. ఇది ఇప్పుడు 9,800rpm వద్ద 38PS , 7900rpm వద్ద 29Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే దీనికంటే ముందు వెర్షన్ RR 310 ఇంజిన్ 34 తో పోలిస్తే.. 4PS, 1.7Nm బంప్‌ని సాధించడానికి TVS సామర్థ్యాన్ని పెంచడానికి ఎయిర్-ఇన్‌టేక్‌ను సవరించబడింది. 

అదనంగా ఈ ఇంజన్‌లోని పిస్టన్ కొత్త అల్యూమినియం డూప్ యూనిట్ ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు బైక్ ఇప్పుడు బేస్ రేసింగ్ రెడ్ వేరియంట్‌లో మినహా ద్వి-డైరెక్టోనల్ క్విక్‌షిఫ్టర్‌ను ప్రామాణికంగా పొందుతుంది. 

2024 TVS Apache RR 310 ఫీచర్లు

2024 TVS Apache RR 310 మోడల్ బైక్.. TVS Smart Xonnect టెక్నాలజీతో 5-అంగుళాల నిలువు TFT కన్సోల్‌ను కలిగి ఉంటుంది. కన్సోల్ రేస్ టెలిమెట్రిక్‌లతో పాటు వేగం, టాకోమీటర్ రీడౌట్‌లు, సమయం, ఫ్యుయెల్ లెవెల్, ట్రిప్ , ఓడోమీటర్ రీడౌట్‌ల వంటి సాధారణ రీడౌట్‌లను డిస్ ప్లే చేస్తుంది. 

మొత్తానికి ఈ అప్డేట్స్, పనితీరులో మెరుగుదల, కొత్త ఫీచర్లు కస్టమర్లను బాగా ఆకట్టుకుంటాయి. ధర కూడా తక్కువగా ఉండటంతో కస్టమర్లు ఎక్కవుగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. మునుపటి వెర్షన్ కంటే కొత్త కొత్త Apache RR 310 మోడల్ ధరకంటే రూ. 3వేలు తక్కువే.