ఆస్ట్రేలియా X సౌతాఫ్రికా..నేడు విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి సెమీ ఫైనల్​

  • రా. 7.30 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తొలి సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రంగం సిద్ధమైంది. గురువారం జరిగే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచి ఎనిమిదోసారి ఫైనల్లోకి అడుగుపెట్టాలని కంగారూలు లక్ష్యంగా పెట్టుకుంటే.. సఫారీలు ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో సౌతాఫ్రికాను ఓడించి ఆరోసారి విజేతగా నిలిచింది. దీంతో ఎలాగైనా ఈసారి ఆస్ట్రేలియాకు సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాలని సౌతాఫ్రికా భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బట్టి చూస్తే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతోంది.

టోర్నీలో ఆడిన 10 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో తొమ్మిది గెలిచారు. ఇక విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికాతో తలపడిన ఏడుసార్లు ఆసీసే నెగ్గింది. గతేడాది సౌతాఫ్రికాతో ఆడిన జట్టులో మెగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినహా మిగతా వారందరూ ఉన్నారు. అలీసా హీలీ, బెత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూనీ, ఎలీసా పెర్రీ, మేఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆష్లే గాడ్నెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెన్నెముకగా కొనసాగుతున్నారు. దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్లో ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బ్యాటింగే అతి పెద్ద బలం. లిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సదర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ప్రమాదకరమే. ఇక సౌతాఫ్రికాలో స్లో లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మలాబాపైనే ఎక్కువ ఆశలు ఉన్నాయి.

నాలుగు లీగ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 10 వికెట్లు తీసిన ఆమె మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లారా వోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తన్జిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మారిజానె కాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విన్నర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. కాకపోతే ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఈ అందరూ సమష్టిగా ఆడటంలో విఫలమవుతుండటం మైనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలువరిస్తే తొలిసారి టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచే అద్భుత అవకాశం సౌతాఫ్రికా ముందు ఉంటుంది.