OTT Movies: ఓటీటీలో ఏప్రిల్ 11న ఒక్కరోజే 20కి పైగా సినిమాలు.. తెలుగులో 5 స్పెషల్

OTT Movies: ఓటీటీలో ఏప్రిల్ 11న ఒక్కరోజే 20కి పైగా సినిమాలు.. తెలుగులో 5 స్పెషల్

ఎప్పటిలాగే ఈ వారం పలు సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌, ఆహా, జియో హాట్ స్టాట్ వంటి వివిధ ఓటీటీల్లో సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం ఏప్రిల్ 11న ఒక్కరోజే దాదాపు 20 సినిమాలు వచ్చాయి. అందులో హిస్టారికల్, ఫ్యామిలీ డ్రామా, హారర్, క్రైమ్, రొమాంటిక్, థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి.

వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన చిత్రం 'ఛావా'. శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా విక్కీ కౌశల్, రష్మిక లీడ్ రోల్స్లో లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్స్ లో రికార్డు వసూళ్లు రాబట్టింది. శుక్రవారం ఏప్రిల్ 11 నుంచి నెట్ఫ్లిక్స్లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ సంచలన విజయం సాధిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.

►ALSO READ | Mass Jathara: మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరింది.. ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ బీట్ రీ క్రియేట్..

ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్ షణ్ముఖ, మలయాళ మూవీ పెరుసు, హిందీ హారర్ థ్రిల్లర్ ఛోరీ 2, పొలిటికల్ డ్రామా రాచరికంతో పాటు మరికొన్ని ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి. 

నెట్‌ఫ్లిక్స్:

కోర్ట్ (తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా)- ఏప్రిల్ 11

ఛావా (హిందీ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్)- ఏప్రిల్ 11

పెరుసు (తెలుగు, తమిళ అడల్ట్ కామెడీ డ్రామా)- ఏప్రిల్ 11

ది గార్డెనర్ (ఫ్రెంచ్ యాక్షన్ కామెడీ)- ఏప్రిల్ 11

చేజింగ్ ది విండ్ (ఇంగ్లీష్ రొమాంటిక్)- ఏప్రిల్ 11

ఆహా:

షణ్ముఖ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్)- ఏప్రిల్ 11

అమెజాన్ ప్రైమ్:

ఛోరీ 2 (హిందీ హారర్ థ్రిల్లర్)- ఏప్రిల్ 11

జియో హాట్‌స్టార్:

హ్యాక్స్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11

పీస్ బై పీస్ (అమెరికన్ మ్యూజికల్ యానిమేషన్ కామెడీ)- ఏప్రిల్ 11

స్వీట్ హార్ట్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ)- ఏప్రిల్ 11

రెస్క్యూ హై సర్ఫ్ (అమెరికన్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6 (తెలుగు డబ్బింగ్ హిందీ యానిమేషన్ మైథాలజీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11

పెట్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 11

సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ:

రాక్షస (తెలుగు, కన్నడ టైమ్ లూప్ హారర్ థ్రిల్లర్ చిత్రం)- - ఏప్రిల్ 11

మనరోమ మ్యాక్స్ ఓటీటీ:

పెయిన్‌కిలి (మలయాళ రొమాంటిక్ కామెడీ)- ఏప్రిల్ 11

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ:

రాచరికం (తెలుగు పొలిటికల్ డ్రామా)- ఏప్రిల్ 11

యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీ:

యువర్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11

హోయ్‌చోయ్ ఓటీటీ:

లొజ్జ (హిందీ, బెంగాలీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11