ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ఏథర్ కొత్త అప్‌డేట్స్‌తో తీర్చిదిద్దిన 2025 ఏథర్ 450 సిరీస్ ఈ–స్కూటర్లను లాంచ్చేసింది. 2025 ఏథర్ 450ఎస్ ధర రూ. 1,29,999 (ఎక్స్‌షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. అయితే 2.9 కిలోవాట్అవర్ బ్యాటరీతో కూడిన 2025 ఏథర్ 450ఎక్స్ ధర రూ. 1,46,999 కాగా, 3.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ గల ఏథర్ 450 ఎక్స్ ధర రూ. 1,56,999 ఉంటుంది.
ఎపెక్స్మోడల్ధర రూ.రెండు లక్షలు. ఇందులోని మ్యాజిక్ ట్విస్ట్ ఫీచర్వల్ల రైడర్లు థ్రోటిల్‌ని మాత్రమే ఉపయోగించి బ్రేక్, యాక్సిలరేట్ చేయవచ్చు. మల్టీ-మోడ్ ట్రాక్షన్ కంట్రోల్ వీలు జారడాన్ని ఆపడంలో సహాయపడుతుంది. యూజర్ అవసరాలకు తగ్గట్లుగా రెయిన్ మోడ్, రోడ్ మోడ్, ర్యాలీ మోడ్లు ఉంటాయి.