సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బిగ్ అప్డేట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్ విభాగాల్లో 979 సివిల్స్ పోస్టుల భర్తీ కోసం సివిల్స్ (ప్రిలిమ్స్) నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది యూపీఎస్సీ. 2025, జనవరి 22 నుంచి 2025, ఫిబ్రవరి 11వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపింది.
2025, మే 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది. అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని.. అప్లై సమయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత అధికారులను సంప్రదించాలని పేర్కొంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అయిన అభ్యర్థులు అర్హులని తెలిపింది.
డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.. కానీ మెయిన్స్ పరీక్షల సమయానికి మాత్రం డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొంది. 2025, ఆగస్ట్ 1వ తేదీ నాటికి 21 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 బీసీ, ఓబీసీలకు దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదని తెలిపింది.