Valentine Day Movies: వాలంటైన్స్ డే స్పెషల్: థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు

Valentine Day Movies: వాలంటైన్స్ డే స్పెషల్: థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు

వాలంటైన్స్ డే (Feb14) స్పెషల్గా థియేటర్/ ఓటీటీల్లో అదిరిపోయే సినిమాలు వస్తున్నాయి. అందులో ఫ్యామిలీ, రొమాంటిక్, యాక్షన్, క్రైమ్, హిస్టారిక్ జోనర్స్లో సినిమాలు ఉండనున్నాయి. ఈ సారి (2025) థియేటర్లో యూత్ కి ఆకట్టుకునే లవ్ రొమాంటిక్ సినిమాలు అట్ట్రాక్ట్ చేయనున్నాయి. ముఖ్యంగా లైలా, ఇట్స్ కాంప్లికేటెడ్, ఆరెంజ్ సినిమాలు ఉన్నాయి. అలాగే మిగతా జోనర్స్ లో కూడా ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు రానున్నాయి. అవేంటో ఓలుక్కేయండి. 

థియేటర్ సినిమాలు

1. లైలా:

విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ రూపొందిస్తున్న చిత్రం ‘లైలా’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సాహు గారపాటి నిర్మించారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా రూపొందిన ఈ మూవీలో అబ్బాయిగా, అమ్మాయిగా రెండింటినీ పోషించి వెర్సటాలిటీ చూపించబోతున్నాడు విశ్వక్ సేన్. ఈ మూవీ వాలెంటైన్స్ డే స్పెషల్గా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.లైలా సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బగ్ఛీ సంగీతం అందిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్తో, కొత్త అవతారంలో వస్తున్న విశ్వక్ ఈ సినిమాతో ఆడియన్స్ను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

2. బ్రహ్మా ఆనందం:

టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ కలిసి చేస్తున్న మూవీ ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన వీళ్లు..ఇందులో  తాత, మనవళ్లుగా కనిపించబోతున్నారు. ఆర్వీఎస్ నిఖిల్ ఈ చిత్రానికి దర్శకుడు.

తెలుగులో మసూద, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి సినిమాలు అందించిన రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ  చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. శాండిల్య  పీసపాటి సంగీతం అందిస్తున్నాడు.

3. తల:

అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘తల’. ఈ మూవీలో హీరోగా అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ తొలి పరిచయం అవుతున్నాడు. అంకిత నస్కర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతుంది.

4. ఇట్స్ కాంప్లికేటెడ్: 

సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లోనే ‘కృష్ణ అండ్ హిస్ లీల’ చాలా స్పెషల్ మూవీ. రొమాంటిక్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు వీపరీతంగా నచ్చింది. ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో సిద్దు కెరీర్ లో డీజే టిల్లు వచ్చి చేరింది. ఇకపోతే ఐదేళ్ల క్రితం కరోనా టైమ్‌‌‌‌లో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రాన్ని ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ టైటిల్‌‌‌‌తో ఫిబ్రవరి 14న థియేటర్స్‌‌‌‌లో రిలీజ్ చేస్తున్నారు.

రవికాంత్ పెరేపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్ హీరోయిన్స్‌‌‌‌గా నటించారు. కొత్త టైటిల్‌‌‌‌తో థియేటర్స్‌‌‌‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలా మెస్మరైజ్ చేయనుందో చూడాలి. 

5. ఆరెంజ్ రీ రిలీజ్:

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- జెనీలియా జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ఆరెంజ్. ఈ మూవీ వాలెంటైన్ డే స్పెషల్ గా థియేటర్స్ లో రీ రిలీజ్ కానుంది. ఆరెంజ్‌ మూవీ వచ్చి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా థియేటర్లలో సినీ ప్రియులను అలరించనుంది. 

6. చావా:

రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ బాలీవుడ్ హిస్టారికల్ మూవీ ఛావా. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవితం ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించాడు. ఇందులో శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక కనిపించనున్నారు.

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్‌గా అక్షయ్ ఖన్నా నటించారు. హంబిరావు మోహితేగా అశుతోష్ రాణా, సోయారాబాయిగా దివ్య దత్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ ఎపిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా టీజర్, ట్రైలర్ విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయి. 

భువనమ్ గగనం:

దర్శకుడు గిరీష్ ములిమణి తెరకెక్కించిన కన్నడ మూవీ భువనమ్ గగనం. SVC ఫిల్మ్స్ బ్యానర్ పై ఎం మునగౌడ నిర్మించారు. ప్రమోద్, పృథ్వీ అంబర్, రేచల్ డేవిడ్, పొన్ను అశ్వతి ప్రధాన పాత్రల్లో నటించారు. కాలేజీ నేపథ్యంలో లవ్ అండ్ యూత్ ఎంటర్ టైన్ గా తెరకెక్కింది. ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.

7. సంకి:

అహన్ శెట్టి, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ సంకి. ఇందులో అహాన్‌, పూజ మధ్య కెమిస్ట్రీ సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. లవ్ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 14, 2025న థియేటర్లలోకి రానుంది.

ఓటీటీ సినిమాలు: 

నెట్‌ఫ్లిక్స్:

ఐయామ్ మ్యారీడ్.. బట్! (కొరియన్ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్- ఫిబ్రవరి 14

లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 8 (ఇంగ్లీష్ రియాలిటీ షో)- ఫిబ్రవరి 14

ధూమ్ ధామ్ (హిందీ కామెడీ యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)- ఫిబ్రవరి 14

మెలో మూవీ (కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 14

సోనీ లివ్ ఓటీటీ:

మార్కో (తెలుగు డబ్బింగ్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్)- ఫిబ్రవరి 14

ఈటీవీ విన్‌: 

సమ్మేళనం (తెలుగు) - ఫిబ్రవరి 13

అమెజాన్ ప్రైమ్:

మై ఫాల్ట్: లండన్ (బ్రిటీష్ రొమాంటిక్ డ్రామా)-  ఫిబ్రవరి 13

జీ5:

ప్యార్ టెస్టింగ్ (హిందీ)- ఫిబ్రవరి 14

ఆహా:

డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ (తెలుగు రియాలిటీ డ్యాన్స్ షో)- ఫిబ్రవరి 14

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

బాబీ ఔర్ రిషికి లవ్ స్టోరీ (హిందీ లవ్ అండ్ రొమాంటిక్ సినిమా)- ఫిబ్రవరి 11

లయన్స్ గేట్ ప్లే:

సబ్‌సర్వియన్స్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్)- ఫిబ్రవరి 14

హోయ్‌చోయ్:

బిషోహోరి (బెంగాలీ సూపర్ నాచురల్ హారర్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13

మనోరమ మ్యాక్స్:

ఒరి కాట్టిల్ ఒరి మురి (మలయాళ రొమాంటిక్ కామెడీ)- ఫిబ్రవరి 10