
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) అత్యాధునిక ఫీచర్లతో కూడిన కొత్త ఓబీడీ2బీ కంప్లయంట్ ఇంజన్ గల డియో 125ను విడుదల చేసింది. దీని ధర రూ. 96,749 (ఎక్స్-షోరూమ్, పూణే) అని ప్రకటించింది. దీనిలోని 123.92 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ 6.11 కిలోవాట్ల శక్తిని, 10.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ బండిలో 4.2 ఇంచుల డిస్ప్లే, మైలేజ్ ఇండికేటర్లు, ట్రిప్ మీటర్, ఎకో ఇండికేటర్, కాల్, మెసేజ్ అలర్ట్‌లు, యూఎస్బీ పోర్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి.