సంక్రాంతి పండుగంటేనే సినిమాల జాతర. ఆ జాతరకు పెద్ద హీరోల సినిమాలు వస్తే ఇక ప్రేక్షకులకు విందుభోజనమే. ప్రస్తుతం థియేటర్స్లో తెలుగు సినీ అభిమానులకు ఇప్పడాలనే ఉంది. ఒక్కటేమిటీ ఏకంగా మూడు సినిమాలు థియేటర్స్లో సందడి చేస్తున్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బరిలో ఉన్నాయి.
అయితే, ఈ క్రమంలో థియేటర్స్ సినిమాలకు ధీటుగా ఓటీటీ కూడా సినిమాల జాతరను తీసుకొచ్చింది. సంక్రాంతి పండుగకు ఈ వారం (జనవరి 13 నుంచి 19 వరకు) ఓటీటీలోకి 15కి పైగా సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అవి కూడా క్రైమ్ థ్రిల్లర్స్, యాక్షన్, హారర్, రొమాంటిక్, కామెడీ జోనర్స్‌లో ఉన్నాయి. అవేంటో చూస్తే ఆడియన్స్ కు పండుగ మొదలైనట్టే. ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
విత్ లవ్, మేఘన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జనవరి 15
గ్జో, కిట్టీ సీజన్ 2 (కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- జనవరి 16
బ్యాక్ ఇన్ యాక్షన్ (ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్)- జనవరి 17
ది రోషన్స్ (హృతిక్ రోషన్ ఫ్యామిలీ డాక్యుమెంటరీ హిందీ సిరీస్)- జనవరి 17
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
All We Imagine as Light - జనవరి 3
సూక్ష్మదర్శిని- (మలయాళ,తెలుగు సినిమా) జనవరి 11, 2025
పవర్ ఆఫ్ పాంచ్ (హిందీ ఫాంటసీ సూపర్ నేచురల్ వెబ్ సిరీస్)- జనవరి 17
అమెజాన్ ప్రైమ్
బచ్చల మల్లి- (రూరల్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్) జనవరి 10
మిస్ యూ (రొమాంటిక్ ఎంటర్‌టైనర్) జనవరి 10
ఛిడియా ఉడ్ (హిందీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 15 (అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్)
పాతాల్ లోక్ సీజన్ 2 (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 17
ఐ వాంట్ టు టాక్ (హిందీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జనవరి 17
జీ5 ఓటీటీ
ది సబర్మతి రిపోర్ట్( గుజరాత్ అల్లర్ల ఆధారంగా) జనవరి 10
విడుతలై పార్ట్ 2 (తమిళ యాక్షన్ డ్రామా మూవీ)- జనవరి 17
ఆహా ఓటీటీ
హైడ్ అండ్ సీక్ (తెలుగు ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్)- జనవరి 10న
అన్‌స్టాపబుల్ రామ్‌చరణ్ సెకండ్ ఎపిసోడ్ (జనవరి 17న)
జియో సినిమా ఓటీటీ
స్పీక్ నో ఈవిల్ (హాలీవుడ్ హారర్ డ్రామా మూవీ)- జనవరి 13
హార్లీ క్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ యానిమేటెడ్ యాక్షన్ వెబ్ సిరీస్)- జనవరి 17
ALSO READ | Vishal Health Update: నాకెలాంటి సమస్య లేదు. .మైక్ కూడా పట్టుకోగలుగుతున్నా.. ఆరోగ్యంపై విశాల్ క్లారిటీ
సోనీ లివ్ ఓటీటీ
పాని (మలయాళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జనవరి 16
ఎపిక్ ఆన్ ఓటీటీ
గృహ లక్ష్మీ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 16
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
హెల్‌బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్ (హెల్‌బాయ్ 4) (హాలీవుడ్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 17
మనోరమ మ్యాక్స్ ఓటీటీ
పొంబలై ఒరుమై- జనవరి 10న
ఐయామ్ కథలన్ (మలయాళ కామెడీ మూవీ)- జనవరి 17
సన్‍నెక్స్ట్ ఓటీటీ
కడకన్- జనవరి 3
బచ్చల మల్లి జనవరి 10
బీసినీట్ ఓటీటీ
ప్రేమించొద్దు’ జనవరి 10
ఇందులో స్పెషల్ మూవీస్ గురించి చెప్పుకోవాలంటే.. విజయ్ సేతుపతి నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ విడుదల పార్ట్ 2, మలయాళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా పాని, మలయాళ థ్రిల్లర్ డ్రామా సూక్ష్మదర్శిని, హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పాతాల్ లోక్ 2, గృహ లక్ష్మీ, ఫాంటసీ థ్రిల్లర్ పవర్ ఆఫ్ పాంచ్, డాక్యుమెంటరీ సిరీస్ ది రోషన్స్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అలాగే హాలీవుడ్ హారర్ మూవీ స్పీక్ నో ఈవిల్, హారర్ యాక్షన్ థ్రిల్లర్ హెల్‌బాయ్ 4 కూడా స్పెషల్ గా ఉన్నాయి.