
నెట్ఫ్లిక్స్(NETFLIX)లో సినిమా వస్తుందంటే.. సినీ ప్రేక్షకులు ఖుషి అవుతారు. ఇందులో వచ్చే సినిమాల్లో ఏదైనా బలమైన సందేశం ఐనా..ఎవ్వరికీ తెలియని ఇన్ఫర్మేషన్ ఐనా ఉండేలా స్ట్రాంగ్ బెస్ మెంట్ ఏర్పాటు చేసుకుంది నెట్‌ఫ్లిక్స్. తెలుగు, బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్, స్పానిష్ అంటూ ఒక భాష, ప్రాంతీయతతో, దేశం సంబంధం లేకుండా అన్ని రకాల మూవీస్, వెబ్ సిరీస్ ఉండటం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ప్రత్యేకత.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్లో క్రైమ్ సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్స్, డ్రామా ఓరియెంటెడ్ ఇలా ప్రతో జోనర్ ఇష్టపడే వాళ్లకి మూవీస్ అందుబాటులో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ ప్రతివారం గ్లోబల్, ఇండియా టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్టు రిలీజ్ చేస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో ప్రస్తుతం ఇండియాలో (2025 మార్చి 31) టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్ నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఇందులో లేటెస్ట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ, తమిళ కామెడీ మూవీ, ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ టాప్‌లో ఉన్నాయి.
ఈ మూవీస్ 2025 ఏడాదిలోనే థియేటర్స్లో రిలీజై, ప్రేక్షకుల చేత ఆదరించబడ్డాయి. అంతేకాకుండా కమర్షియల్ గానూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్ ఇవే:
1. ఆఫీసర్ ఆన్ డ్యూటీ
2. డ్రాగన్
3. ఎమర్జెన్సీ
4. ఆజాద్
5. తండేల్
6. నాదానియా
7. ది ఎలక్ట్రిక్ స్టేట్
8. విదాముయర్చి
9. పుష్ప 2: ది రూల్
10. ధూమ్ ధామ్
ఆఫీసర్ ఆన్ డ్యూటీ:
మలయాళంలో వచ్చిన లేటెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజైంది. ఇందులో కుంచాకో బోబన్, ప్రియమణి, జగదీశ్, విశాక్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్కడీ ప్రేక్షకులను ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది. దాంతో ఇటీవలే మార్చి 14న తెలుగు థియేటర్స్లో వచ్చింది. ఇక వారం గడవక ముందే ఓటీటీలోకి అడుగుపెట్టింది.
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మలయాళం, హిందీ, తెలుగు, తమిళం మరియు కన్నడ భాషలలో నెట్‍ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాకు జితూ అష్రాఫ్ దర్శకత్వం వహించారు. మలయాళంలో దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ రూ.40 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ :
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్ (Dragon). తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా వచ్చింది. ఫిబ్రవరి 21న థియేటర్స్కి వచ్చిన డ్రాగన్..వరల్డ్ వైడ్గా రూ.100 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మూవీ తెలుగు ఆడియన్స్ ని వీపరీతంగా ఆకట్టుకుంది.
మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాలేజీ లైఫ్, జాబ్ లైఫ్ ని బేస్ చేసుకుని రాసిన సీన్స్ యూత్ ని కట్టి పడేశాయి. తమిళ్ తో పాటూ తెలుగులో కూడా సూపర్ హిట్ కలెక్షన్స్ రాబట్టింది. మార్చి 21 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే:
1. ఖాకీ: ది బెంగాల్ చాప్టర్:
2. అడోలసెన్స్
3. డబ్బా కార్టెల్
4. క్రైమ్ ప్యాట్రోల్: సిటీ క్రైమ్స్
5. వెన్ లైఫ్ గివ్స్ యు టాంగరైన్స్
6. ఖాకీ: ది బిహార్ ఛాప్టర్
7. స్క్విడ్ గేమ్ సీజన్ 2
8. సకమొటో గేమ్స్
9. వోల్ఫ్ కింగ్ సీజన్ 1
10. బ్లాక్ వారెంట్: సీజన్ 1
ఖాకీ: ది బెంగాల్ చాప్టర్:
'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్' (Khakee The Bengal Chapter).మార్చి 20న నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది. బేబీ, అయ్యారీ, స్పెషల్ 26, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ మరియు సికందర్ కా ముఖద్దర్ సినిమాలను డైరెక్ట్ చేసిన నీరజ్ పాండే ఈ సిరీస్కు షో రన్నర్గా వ్యవహరించాడు. దేబాత్మ మండల్ డైరెక్ట్ చేశాడు. మొదట నవంబర్, 2022లో ఫస్ట్ సీజన్ వచ్చింది. తర్వాత ఆగస్ట్ 2023లో రెండో సీజన్ను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడిది షో ఖాకీ: ది బీహార్ చాప్టర్‌కు కొనసాగింపుగా వచ్చింది.
రెండోస్థానంలో అడోలసెన్స్ అనే సిరీస్ ఉంది. ఈ నాలుగు ఎపిసోడ్ల షార్ట్ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఒక్కో ఎపిసోడ్ ను ఒకే షాట్లో షూట్ చేయడం ఈ సిరీస్ యొక్క స్పెషల్. ఇండియాలోనూ ఈ వెబ్ సిరీస్ కు అదే స్థాయిలో ఆడియన్స్ ఆదరిస్తున్నారు. దాంతో ఈ సిరీస్ టాప్ ట్రెండింగ్లో రెండో స్థానంలో దూసుకెళ్తోంది.