మనోజ్ కుమార్ కటోకర్ రూపొందించిన ‘మై సౌత్ దివా క్యాలెండర్’ ద్వారా ఇప్పటికే పరిచయమైన పలువురు టాప్ హీరోయిన్స్‌గా రాణిస్తున్నారు. తాజాగా 2025 క్యాలెండర్‌ను 12 మంది స్టార్స్‌తో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకులు కరుణ కుమార్, సుజనా రావు, సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్ తెలియజేశారు.
హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, శ్రియా శరన్, కేథరిన్ థ్రెసా, మాళవికా శర్మ, తాన్య హోప్, ఐశ్వర్య కృష్ణ, కుషిత కొల్లాపు, వినాలీ భట్నాగర్, రియా సచ్ దేవ్, కనిక మాన్, పలక్ అగర్వాల్‌తో కలర్‌ఫుల్ క్యాలెండర్‌ను రూపొందించారు. తమ క్యాలెండర్ ద్వారా ఈ ఏడాది ఐదుగురిని పరిచయం చేస్తున్నామని, ఈ జర్నీలో తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ మనోజ్ కుమార్ థ్యాంక్స్ చెప్పారు. ఇందులో భాగమవడం హ్యాపీగా ఉందని హీరోయిన్స్ అన్నారు.