2025లో టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులు ఇవే..

 2025లో టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులు ఇవే..

2024 సంవత్సరానికి వీడ్కోలు చెప్పేసి.. కొత్త ఆశలతో 2025లోకి అడుగుపెట్టాం. కమర్షియల్ ఎంటర్‌‌‌‌టైనర్స్‌‌, కంటెంట్‌‌ ఓరియెంటెడ్ సినిమాలతో టాలీవుడ్‌‌ న్యూఇయర్‌‌‌‌కి వెల్‌‌కమ్ చెబుతోంది. మరి ఈ ఏడాది థియేటర్స్‌‌లో సందడి చేసేందుకు రెడీ అవుతున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్‌‌ల వివరాలేంటో చూద్దాం..

సంక్రాంతి పందెం కోళ్లు

రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్టు  ‘గేమ్ చేంజర్’  తో ఈ ఏడాది పండగ మొదలు కానుంది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్‌‌వైడ్‌‌గా రిలీజ్ అవుతోంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే బాలకృష్ణ హీరోగా బాబీ రూపొందించిన ‘డాకు మహారాజ్’ ఈ నెల 12న, వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ నెల 14న సంక్రాంతి రేసులో ఉన్నాయి.  ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాలపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.

ఫిబ్రవరిలో ఫిదా చేసేందుకు.. 

నాగ చైతన్య, -సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ చిత్రం  ఫిబ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా  చందూ మొండేటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇక ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున విశ్వక్ సేన్ నటిస్తున్న ‘లైలా’ చిత్రం రిలీజ్ కానుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా దర్శకుడు  రామ్ నారాయణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక నాగార్జున, ధనుష్​ హీరోలుగా శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ‘కుబేర’ చిత్రం ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది. ముంబై బ్యాక్‌‌డ్రాప్‌‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌‌గా నటిస్తోంది. నితిన్ ‘తమ్ముడు’ సినిమా శివరాత్రి సందర్భంగా రిలీజ్  చేయనున్నట్టు ప్రకటించారు. కానీ నితిన్ నటించిన ‘రాబిన్ హుడ్’ వాయిదా పడటంతో  ఈ మూవీ రిలీజ్ విషయంలో టీమ్  మరోసారి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 

స్టార్ మార్చ్ 

మార్చ్ నెలలో స్టార్ వార్ జరగబోతోందని తెలుస్తోంది. సంక్రాంతికి రావాల్సిన  చిరంజీవి ‘విశ్వంభర’ వాయిదా పడి మార్చ్ నెలకు షిఫ్ట్ అయింది. ఇప్పటికే  పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని మార్చ్ 28న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. అలాగే  విజయ్ దేవరకొండ నటిస్తున్న తన  12 మూవీ  కూడా ఇదే నెలలో రిలీజ్ అని తెలుస్తోంది. 

సమ్మర్ సైన్మాలు

ప్రభాస్ హీరోగా మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ ‘ది రాజా సాబ్’ ఏప్రిల్ 10న  ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే ప్రకటించారు. రొమాంటిక్ హారర్ జానర్‌‌‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని  టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ మూవీ కూడా ఇదే డేట్‌‌కు ప్రకటించారు. అలాగే అనుష్క లీడ్‌‌ రోల్‌‌లో క్రిష్ రూపొందిస్తున్న ‘ఘాటీ’, తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘మిరాయ్’ చిత్రాలను  ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. అలాగే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు  నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ‘హిట్3’ చిత్రం మే 1న, రవితేజ హీరోగా నటిస్తున్న  ‘మాస్ జాతర’ మే 9న రిలీజ్ కానున్నాయి.  

సెప్టెంబర్‌‌‌‌లో తాండవం

బాలకృష్ణ, బోయపాటి కాంబోలో ఇటీవల ‘అఖండ2 తాండవం’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్టు  ప్రకటించారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సినిమాలు సక్సెస్ సాధించడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు అదే డేట్‌‌కు సాయి దుర్గ తేజ్ నటిస్తున్న  ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రాన్ని కూడా విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ చిత్రాల రిలీజ్ డేట్స్ ఇప్పటికే ప్రకటించినప్పటికీ, కాస్త అటుఇటుగా మార్పులు ఉండే అవకాశాలు లేకపోలేదు. వీటితోపాటు మరికొన్ని చిత్రాలు కూడా ఈ ఏడాది ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి.

డార్క్ హ్యూమర్‌‌‌‌తో బాపు

బ్రహ్మాజీ లీడ్‌‌ రోల్‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘బాపు’.  ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  రాజు, సిహెచ్. భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.  తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌‌ను రానా దగ్గుబాటి లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పాడు.    రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఓ వ్యవసాయ కుటుంబం ఎమోషనల్ జర్నీని ఇందులో చూపించబోతున్నారు.  కుటుంబ సభ్యుల మనుగడ కోసం ఒకరు తన జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తే ఆ ఫ్యామిలీలో పరిస్థితులు ఎలా ఉంటాయనేది హ్యుమర్, ఎమోషన్స్ కలయికలో డార్క్ కామెడీ డ్రామాగా రూపొందిస్తున్నారు.

ఒగ్గు కథ నేపథ్యంలో..

తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గు కథ నేపథ్యంలో రాంబాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్రహ్మాండ’.  ఆమని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  దాసరి మమత సమర్పణలో సురేష్ నిర్మిస్తున్నారు.  పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.  ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఒగ్గు కళాకారులు,  వారి సంస్కృతి సాంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది.  ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఆసక్తికరమైన స్క్రీన్‌‌ ప్లే,  డివోషనల్,  థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటుంది’ అని చెప్పాడు.  ‘చత్తీస్‌‌గడ్, కర్ణాటక  ప్రాంతాల్లో చిత్రీకరించాం.  ఆమని, బలగం జయరాం, కొమురక్క సహకారం మర్చిపోలేం.  త్వరలోనే ఆడియో, సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’ అని నిర్మాతలు తెలియజేశారు.   

కాళోజీ సందేశం

మూలవిరాట్,  పద్మరాజ్ కుమార్, స్వప్న  ప్రధానపాత్రల్లో ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’.  డిసెంబర్ 23న విడుదలైంది.  ఈ చిత్రానికి లభిస్తున్న స్పందన గురించి దర్శకుడు ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ ‘విద్యార్థులకు మహాకవి కాళోజీ గారి సందేశం  అందితే, మేము సినిమా తీసిన ప్రయోజనం నెరవేరుతుందని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉదయం ఆటను స్కూలు పిల్లలకు ఉచితంగా ప్రదర్శించాం. ఊహించిన దానికి మించి రెస్పాన్స్ వచ్చింది’ అని చెప్పారు. కాళోజీ జీవితాన్ని తెరకెక్కించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని నిర్మాత విజయలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు.  

రిలీజ్‌‌కు రెడీ

కవిన్, అపర్ణదాస్ జంటగా నటించిన చిత్రం ‘పా.. పా..’.  తమిళంలో ‘డా..డా..’ పేరుతో మెప్పించిన ఈ చిత్రాన్ని నీరజ కోట తెలుగులో విడుదల చేస్తున్నారు.  జనవరి 3న ఈ చిత్రం తెలంగాణ,  ఆంధ్ర ప్రాంతాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియాల్లో విడుదల కానుంది.  ఈ సందర్భంగా నీర కోట మాట్లాడుతూ ‘తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌‌తో తెరకెక్కిన ఈ చిత్రం కోలీవుడ్‌‌లో మంచి విజయాన్ని అందుకుంది.  ప్రేమ,  కామెడీ,  ఎమోషనల్‌‌ అంశాలు కలగలిసిన ఫీల్ గుడ్‌‌ సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది.  తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుద‌‌ల చేస్తున్నారు’ అని చెప్పారు.  

నా గుండె జారిపోయిందే..

వరుణ్ రాజ్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘పోకిరి’. మమత హీరోయిన్. వికాస్ దర్శకుడు. తాజాగా ఈ చిత్రంలోని ‘నా గుండె జారిపోయిందే’ అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా వరుణ్ రాజ్ మాట్లాడుతూ  ‘‘పోకిరి’ అనే టైటిల్‌‌లో ఎంతో దమ్ముంది. ఆ పేరుకు మహేష్ బాబు గారే ఓనర్. మేమంతా అభిమానులం.  ఈ చిత్రంతో హిట్ కొడతాననే కాన్ఫిడెన్స్ ఉంది’ అన్నాడు.  దర్శకుడు మాట్లాడుతూ ‘కథ రాసినప్పుడే ఈ టైటిల్ అనుకున్నాం. వేరే టైటిల్‌‌ అనుకున్నప్పటికీ కథ ప్రకారం అదే సరిపోవడంతో ‘పోకిరి’ టైటిల్‌‌తో వస్తున్నాం’ అని చెప్పాడు.  హీరోయిన్ మమత, మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.